ఆరోగ్యానికి తేనె!

మిల మిలమెరిసే పసిడి రంగు... తీపిని పంచే మధురమైన రుచి...  అందరికీ నచ్చే... అందరూ మెచ్చే తేనెతో మేలు ఏంటంటే...

Published : 23 Jan 2022 00:51 IST

మిల మిలమెరిసే పసిడి రంగు... తీపిని పంచే మధురమైన రుచి...  అందరికీ నచ్చే... అందరూ మెచ్చే తేనెతో మేలు ఏంటంటే...

* వంద గ్రాముల తేనె నుంచి దాదాపు 317 గ్రాముల శక్తి లభిస్తుంది. విటమిన్‌ ఎ, సిలతోపాటు క్యాల్షియం, ఇనుము లాంటి ఖనిజాలుంటాయి.
* కొవ్వులు సున్నా శాతం. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి ఎంపిక.
* తేనెలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
* డయేరియాతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గాయాలను మాన్పుతుంది. అల్సర్లు, నొప్పులను తగ్గిస్తుంది.
* రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది.
* శక్తిని అందించడమే కాదు యాంటీ క్యాన్సర్‌ కారకంగానూ పనిచేస్తుంది.
* ఆస్తమా లాంటి శ్వాస సంబంధ రుగ్మతలను నియంత్రిస్తుంది.
* దగ్గు, జలుబు ఉన్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* మిరియాల పొడి, తేనె కలిపి తాగినా దగ్గు తగ్గుముఖం పడుతుంది. గొంతు గరగరనూ తగ్గిస్తుంది.
* తేనె, నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. తక్షణ శక్తి లభిస్తుంది. రోగనిరోధకతా పెరుగుతుంది.
* దాల్చిన చెక్క పొడితో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. మల బద్ధకం సమస్య ఉత్పన్నం కాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని