ఖరీదైన కమలాలు.. నల్లని యాపిల్స్‌..

మార్కెట్‌లో పుచ్చకాయ ధర యాభై నుంచి దాదాపు 150 రూపాయలుంటే ‘అమ్మో ఇంత రేటా’ అనేస్తాం. అయితే ఒక పుచ్చకాయ ధర వేలల్లో ఉంటే? యాపిల్స్‌ ఎర్రగా, ఆకుపచ్చగా ఉంటాయని తెలుసు... నల్లగా ఉంటే...  ఆశ్చర్యంగా ఉంది కదూ...

Updated : 03 Apr 2022 06:53 IST

మార్కెట్‌లో పుచ్చకాయ ధర యాభై నుంచి దాదాపు 150 రూపాయలుంటే ‘అమ్మో ఇంత రేటా’ అనేస్తాం. అయితే ఒక పుచ్చకాయ ధర వేలల్లో ఉంటే? యాపిల్స్‌ ఎర్రగా, ఆకుపచ్చగా ఉంటాయని తెలుసు... నల్లగా ఉంటే...  ఆశ్చర్యంగా ఉంది కదూ... ప్రపంచంలో కొన్ని చోట్ల పండే పండ్ల విశేషాలు తెలుసుకుందామా..


డెకొపొన్‌ సిట్రస్‌...

పాన్‌లో కాసే పండిది. మన సాధారణ కమలాల కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. వీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అర డజను పండ్లకు 6000 రూపాయలు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి కేవలం ఆ దేశంలోనే దొరుకుతాయి.


బ్లాక్‌ డైమండ్‌  యాపిల్‌...

ప్పటి వరకు ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో మాత్రమే యాపిల్స్‌ చూశారు. నల్లటి యాపిల్స్‌ గురించి మీకు తెలుసా. బ్లాక్‌ యాపిల్‌ అని పిలిచినా దీని అసలు రంగు మాత్రం ముదురు వంగపండు రంగే. వీటి ధర ఒక్కోటీ రూ.500 పైనే అట. టిబెట్‌లో పండుతుందిది.


స్క్వేర్‌ వాటర్‌ మెలన్‌...

సాధారణంగా పుచ్చకాయ మన దగ్గర గుండ్రంగానో, గుడ్డు ఆకారంలోనో దొరుకుతుంది కదా. జపాన్‌లో మాత్రం చతురస్రాకారంలో లభిస్తుంది. ఆ దేశంలో దీన్ని అలా పండిస్తారు. ఇందుకోసం అవి పిందెలుగా ఉన్నప్పుడే  డబ్బాలో వేసి బిగిస్తారు. ఆ తర్వాత ఇవి పెద్దవై డబ్బా ఆకృతిలోకి మారతాయి. వీటి రుచి అంత బాగుండదు. వీటిని అలంకరణల్లో ఎక్కువగా వాడతారట. వీటి ధర దాదాపు 7500 రూపాయలు ఉంటుందట.


యుబారీ మస్క్‌ మెలన్‌...

దీని ధర రూ.లక్షల్లో ఉంటుంది. సాధారణ కర్బూజలా ఉన్నా... కేజీకి దాదాపు రూ.20 లక్షల వరకు పలుకుతుందట. రుచి కూడా అంతే రేంజ్‌లో తియ్యగా ఉంటుందట. జపాన్‌లోని హొక్కైడొ ప్రాంతంలో పండుతాయివి. సాధారణంగా ఆ దేశంలోనే అమ్ముతారు.


హెలిగన్‌ పైనాపిల్‌

ఇంగ్లండ్‌లోని హెలిగన్‌ గార్డెన్‌లో వీటిని పండిస్తారు. కాయ కాసి పక్వానికి రావడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది.  వీటిని అతి కొద్ది మొత్తంలోనే పండిస్తారు. కారణం ఒక్క పైనాపిల్‌ ధర అక్షరాలా లక్ష రూపాయలట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని