రబ్డీ క్యారెట్‌ హల్వా

క్యారెట్‌ను శుభ్రంగా కడిగి, ఆరిన తర్వాత పొట్టు తీసి సన్నగా తురమాలి. పొయ్యి మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి పాలు పోసి వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు క్యారెట్‌ తురుము వేసి పాలు సగమయ్యే వరకు

Published : 24 Apr 2022 00:56 IST

కావాల్సినవి: క్యారెట్‌- కేజీ, చక్కెర- మూడు కప్పులు, నెయ్యి- మూడు పెద్ద చెంచాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- సగం టిన్‌, చిక్కటి పాలు- లీటరు, యాలకుల పొడి- చెంచాన్నర, చెర్రీలు, డ్రైఫ్రూట్స్‌- కొన్ని (అలంకరణకు). 

తయారీ: క్యారెట్‌ను శుభ్రంగా కడిగి, ఆరిన తర్వాత పొట్టు తీసి సన్నగా తురమాలి. పొయ్యి మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి పాలు పోసి వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు క్యారెట్‌ తురుము వేసి పాలు సగమయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడ్డాక నెయ్యి, చక్కెర వేసి మరో పది నిమిషాలు కలుపుతూ ఉండాలి. పదార్థం నుంచి నెయ్యి  పైకి తేలే వరకు చిన్నమంటపై మగ్గించాలి. పొయ్యి కట్టేసి క్యారెట్‌ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ సమయంలో రబ్డీని తయారు చేసుకోవాలి. సాధారణంగా రబ్డీని పాలను మరిగించి తయారు చేస్తారు. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా సులువుగా చేసుకునేందుకు కండెన్స్‌ మిల్క్‌ను వాడుకోవచ్చు.

గిన్నెలో పంచదార, కండెన్స్‌డ్‌ పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై మరిగించాలి. యాలకుల పొడి వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి రబ్డీని చల్లార్చాలి. ప్లేట్‌లో క్యారెట్‌ హల్వా తీసుకుని రబ్డీ, డ్రైఫ్రూట్స్‌, చెర్రీలతో అలంకరించుకుంటే తియ్యటి క్యారెట్‌ రబ్డీ హల్వా రెడీ. దీన్ని వేడి వేడిగా లేదా చల్లచల్లగా ఎలాగైనా తినొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని