తింటే ఆరోగ్యం పెరుగుతుంది!

అన్నంలోకి పచ్చడి, పప్పు, కూర.. ఇలా ఎన్ని ఉన్నా.. ఆఖరి ముద్ద పెరుగుతో తింటే ఆ రుచి, సంతృప్తే వేరంటారు పెద్దలు. మరి పెరుగుకు ఉన్న అంత ప్రాధాన్యం ఏమిటి? దాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ...

Published : 24 Apr 2022 00:56 IST

అన్నంలోకి పచ్చడి, పప్పు, కూర.. ఇలా ఎన్ని ఉన్నా.. ఆఖరి ముద్ద పెరుగుతో తింటే ఆ రుచి, సంతృప్తే వేరంటారు పెద్దలు. మరి పెరుగుకు ఉన్న అంత ప్రాధాన్యం ఏమిటి? దాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందామా..

పేగులకు ఆరోగ్యాన్నిస్తూ జీర్ణక్రియకు తోడ్పడే ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా పెరుగులో మెండుగా ఉంటుంది. ఇది పోషకాల గని. 
దీంట్లోని విటమిన్లు, మినరళ్లు శరీరంలోని వివిధ జీవక్రియలను నిర్వర్తించడానికి చాలా అవసరం. 
పెరుగులోని లినోలిక్‌ ఆమ్లం రోగనిరోధకతను పెంచుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు దరి చేరవు. 
కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది.
కడుపులో మంట, వికారంగా ఉన్నప్పుడు పెరుగు తీసుకుంటే చాలా మంచిది.
డయేరియాతో బాధపడేవారు మజ్జిగను తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. పాలకు బదులుగా పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు.
పెరుగులోని క్యాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది.
మాంసకృత్తులు నాడులను మరమ్మతు చేయడమే కాకుండా దృఢంగా మారుస్తాయి.
బరువు తగ్గడానికి చక్కటి ప్రత్యామ్నాయం. చర్మాన్ని మెరిపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. 
మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకుంటే మహిళల్లో వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ తగ్గుముఖం పడతాయి.
ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని