కత్తులకో షార్ప్‌నర్‌!

కూరగాయలు తరిగి సిద్ధంగా ఉండాలే గానీ ఎంతటి  వంటనైనా నిమిషాల్లో చకచకా చేసేయొచ్చు. కూరలు కోయడానికే చాలా సమయం పడుతుంది.  మరి వాటిని కోసేందుకు ఉపయోగించే చాకు మొండిగా ఉంటే పని మరింత...

Published : 24 Apr 2022 00:56 IST

కూరగాయలు తరిగి సిద్ధంగా ఉండాలే గానీ ఎంతటి  వంటనైనా నిమిషాల్లో చకచకా చేసేయొచ్చు. కూరలు కోయడానికే చాలా సమయం పడుతుంది.  మరి వాటిని కోసేందుకు ఉపయోగించే చాకు మొండిగా ఉంటే పని మరింత ఆలస్యమవడమే కాకుండా చిరాగ్గానూ ఉంటుంది. కత్తులను పదును చేసే పరికరం ఉంటే మన పని సులువవుతుంది కదా.

ఈ ఫొటోలో కనిపిస్తోన్న ‘మాన్యువల్‌ నైఫ్‌ షార్ప్‌నర్‌’ అలాంటిదే. ఇది కత్తులను రెండు విధాలుగా పదును చేస్తుంది. ఈ పరికరంలో రెండు బ్లేడ్లుంటాయి (టంగ్‌స్టన్‌ స్టీల్‌, సెరామిక్‌).  మొదటిది మొండి కత్తులను పదునుగా చేస్తే... రెండోది మరింత సానపెడుతుంది. చిన్నగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడైనా పెట్టొచ్చు. ధర కూడా తక్కువే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని