నోరూరించే చిల్లీ బ్రెడ్‌!

బ్రెడ్‌ స్లైసులు- నాలుగు, స్ప్రింగ్‌ ఆనియన్‌, చిల్లీ పేస్ట్‌, టొమాటో చిల్లీ సాస్‌- పెద్ద చెంచా చొప్పున; నూనె- మూడు పెద్ద చెంచాలు, వెల్లుల్లి తరుగు- పెద్ద చెంచా, ఉల్లిపాయలు (పెద్ద ముక్కలు), అర కప్పు, క్యాప్సికమ్‌ (పెద్ద ముక్కలు)-

Updated : 01 May 2022 06:03 IST

కావాల్సినవి:  బ్రెడ్‌ స్లైసులు- నాలుగు, స్ప్రింగ్‌ ఆనియన్‌, చిల్లీ పేస్ట్‌, టొమాటో చిల్లీ సాస్‌- పెద్ద చెంచా చొప్పున; నూనె- మూడు పెద్ద చెంచాలు, వెల్లుల్లి తరుగు- పెద్ద చెంచా, ఉల్లిపాయలు (పెద్ద ముక్కలు), అర కప్పు, క్యాప్సికమ్‌ (పెద్ద ముక్కలు)- పావు కప్పు, సోయాసాస్‌, టొమాటో సాస్‌, చిల్లీ సాస్‌, చిల్లీపేస్ట్‌- అర చెంచా చొప్పున; వెనిగర్‌/నిమ్మరసం- పెద్ద చెంచా, నీళ్లు- పావు కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాల పొడి- చెంచా.

తయారీ: బ్రెడ్‌ స్లైసులను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోసి వేడయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి విడిగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో కాస్తంత నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి బాగా వేయించాలి. అందులో సోయా, టొమాటో, చిల్లీసాస్‌లు, చిల్లీ పేస్ట్‌, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత బ్రెడ్‌ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు పెద్ద మంట మీద వేయించాలి. ఇలా వేయించిన బ్రెడ్‌ ముక్కలపై స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేస్తే... రుచికరమైన చిల్లీ బ్రెడ్‌ వేడి వేడిగా రెడీ.

-మాదిరెడ్డి ఉష, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని