పొడవైన జుట్టుకి... పాలకూర!

తక్కిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర శిరోజాలకి ఎక్కువ మేలు చేస్తుందని తెలుసా? యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పాలకూర జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతుంది..

Published : 22 May 2022 00:46 IST

తక్కిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర శిరోజాలకి ఎక్కువ మేలు చేస్తుందని తెలుసా? యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పాలకూర జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతుంది..

కెరాటిన్‌, కొలాజిన్‌ ఈ రెండూ జుట్టు ఎదగడానికి చాలా అవసరం. విటమిన్‌ బి, సిలు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టు రావడానికీ, వేగంగా పెరగడానికీ సాయం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మాడు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.

పాలకూరలో పుష్కలంగా ఉండే ఇనుము వెంట్రుక మొదళ్లకు ఆక్సిజన్‌ అందించి అవి రాలకుండా చూస్తుంది. అలాగే వారంలో ఒకటి, రెండు సార్లు ఈ స్మూథీని తాగి చూడండి. శిరోజాలు ఆరోగ్యంగా, బలంగా మారతాయి.


పాలకూర స్మూథీ

కావాల్సినవి: అరటిపండు- ఒకటి, పాలకూర- అరకప్పు, బొప్పాయిముక్కలు- అరకప్పు, కొబ్బరిపాలు- అరకప్పు

తయారీ: వీటిని బ్లెండర్‌లో వేసి చక్కని స్మూథీలా అయ్యేంతవరకూ బ్లెండ్‌ చేసుకుంటే సరిపోతుంది. పాలకూరని ఆహారంలో ఎంత ఎక్కువగా చేర్చుకుంటే మీ శిరోజాలు అంత అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని