మతిమరుపుకి బ్రేక్‌ వేస్తాయి!

పుచ్చకాయ తినేటప్పుడు వాటి గింజలని అడ్డంగా భావిస్తాం. నిజానికి వాటిల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ గింజలు విడిగా మెలన్‌ సీడ్స్‌ పేరుతో దొరుకుతున్నాయి..

Published : 29 May 2022 01:57 IST

పుచ్చకాయ తినేటప్పుడు వాటి గింజలని అడ్డంగా భావిస్తాం. నిజానికి వాటిల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ గింజలు విడిగా మెలన్‌ సీడ్స్‌ పేరుతో దొరుకుతున్నాయి..

* జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి అనుకొనేవారికి ఈ గింజలు మంచి ఆహారం. రోజూ కొద్దిమొత్తంలో గింజలని తింటే మెదడు చురుగ్గా ఉంటుంది.
* ఒమెగా-త్రీ ఫ్యాటీఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారం... రక్తప్రసరణ సవ్యంగా జరిగేట్టు చేసి బీపీ సమస్యలని అదుపులో ఉంచుతుంది.
* ఎముకలు బలహీనంగా ఉండేవారు రోజూ ఈ గింజలని ఆహారంలో చేర్చుకుంటే... ఆస్టియోపొరోసిస్‌ బారిన పడకుండా ఉంటారు.
* వయసు ఛాయలని దూరం చేసి చర్మం నిగారింపుతో మెరిసేలా చేస్తాయి. సాగే గుణాన్ని కోల్పోకుండా చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని