ఒకటి.. చాలు!

వంటగదిలో ప్రతి పాత్ర తీసుకునేప్పుడు దానికి తగ్గ మూతను తీసుకోవడం మనకు అలవాటే! పాన్‌లు, సూప్‌ పాట్‌ వంటివి గాజు మూతతోనే సెట్టుగా వచ్చేస్తాయి. వాటి స్థానంలో కొత్తవి తేవాల్సి వచ్చినప్పుడే అసలు సమస్య! గాజువి కదా! కంగారులోనో పొరబాటునో చేయి తగిలి కిందపడ్డాయో

Updated : 05 Jun 2022 05:36 IST

వంటగదిలో ప్రతి పాత్ర తీసుకునేప్పుడు దానికి తగ్గ మూతను తీసుకోవడం మనకు అలవాటే! పాన్‌లు, సూప్‌ పాట్‌ వంటివి గాజు మూతతోనే సెట్టుగా వచ్చేస్తాయి. వాటి స్థానంలో కొత్తవి తేవాల్సి వచ్చినప్పుడే అసలు సమస్య! గాజువి కదా! కంగారులోనో పొరబాటునో చేయి తగిలి కిందపడ్డాయో పగిలే అవకాశాలే ఎక్కువ. వాటితో పాటు పాన్‌నీ, గిన్నెల్నీ పడేయలేము. మూతను తీసుకోవడానికే చూస్తాం. సరిగ్గా సరిపోయేవేమో అన్నింటికీ దొరకవు. ఈ చిక్కు నుంచి బయట పడేసేవే యూనివర్సల్‌ లిడ్స్‌. ఒకే మూత భిన్నమైన పాత్రలకు సరిపోయేలా తయారు చేశారు వీటిని. గాజు మూతకు చివర్లో సిలికాన్‌తో భిన్న ఎత్తుల్లో ఉండేలా అమరిక ఉంటుంది. దీంతో భిన్న పరిమాణాల పాత్రలకు చక్కగా అమరిపోతుంది. సిలికాన్‌ కాబట్టి, వేడికీ కరిగిపోతుందన్న దిగులుండదు. స్టీలులోనూ లభిస్తున్నాయి. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌ వేదికలను వెతికేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని