చైౖనా ఊరగాయ..

ఆవకాయ, మాగాయలాంటి ఊరగాయలు మనమే పెట్టుకుంటామా? మరి చైనా, కొరియా లాంటి దేశాలు ఏ పచ్చళ్లు పెట్టుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? లాబా గార్లిక్‌ పచ్చడి చైనాలో ప్రాచుర్యం పొందిన ఊరగాయ. వాళ్లు కొత్త సంవత్సరం రోజున దీన్ని పెడతారు. పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బల్లో.

Published : 12 Jun 2022 01:21 IST

ఆవకాయ, మాగాయలాంటి ఊరగాయలు మనమే పెట్టుకుంటామా? మరి చైనా, కొరియా లాంటి దేశాలు ఏ పచ్చళ్లు పెట్టుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? లాబా గార్లిక్‌ పచ్చడి చైనాలో ప్రాచుర్యం పొందిన ఊరగాయ. వాళ్లు కొత్త సంవత్సరం రోజున దీన్ని పెడతారు. పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బల్లో...ఉప్పు, పంచదార, రైస్‌ వెనిగర్‌ని పోసి పులియబెడతారు. 28 రోజులు ఊరనిచ్చి ఆ తర్వాత మూత తీస్తారు. అప్పటికి వెల్లుల్లి పచ్చగా మారుతుంది. మనం దోసెల్లోకి, ఇడ్లీల్లోకి ఆవకాయ వేసుకున్నట్టు చైనీయులు కూడా దీన్ని స్నాక్స్‌తో కలిపి తింటారు. భోజనానికి ముందు ఆకలి పెంచడానికి తింటారు. లాబాగార్లిక్‌లో యాంటీ ఏజింగ్‌ గుణాలు ఉండటంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని