ఐస్‌క్రీం దోసె...కావాలా?

దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాల్లో దోసె ఒకటి. మసాలా దోసె, ఉల్లి, ఎగ్‌ దోసె వంటివాటిని మీరు చూసే ఉంటారు. కానీ ఐస్‌క్రీం దోసె, లేస్‌, మ్యాంగో దోసె గురించి ఎక్కడన్నా విన్నారా? ఇటువంటి 26 రకాల వెరైటీ దోసెల్ని రుచి చూడాలంటే విజయవాడలోని అంజీ హోటల్‌కి వెళ్లాల్సిందే..  

Updated : 12 Jun 2022 07:05 IST

దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాల్లో దోసె ఒకటి. మసాలా దోసె, ఉల్లి, ఎగ్‌ దోసె వంటివాటిని మీరు చూసే ఉంటారు. కానీ ఐస్‌క్రీం దోసె, లేస్‌, మ్యాంగో దోసె గురించి ఎక్కడన్నా విన్నారా? ఇటువంటి 26 రకాల వెరైటీ దోసెల్ని రుచి చూడాలంటే విజయవాడలోని అంజీ హోటల్‌కి వెళ్లాల్సిందే..  

అంజీ హోటల్‌ వయసు 40 సంవత్సరాలు. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో పాయకరావు పేట ప్రభాస్‌ కాలేజీ వెనక ఉన్న ఈ చిన్న హోటల్‌ ముందు తెల్లవారితే జనాలు బారులు తీరుతుంటారు. ఇలా క్యూలు కట్టే వారిలో స్థానికులే కాదు, సెలబ్రిటీలు ఉండటం విశేషం. అంత చిన్న టిఫిన్‌ సెంటర్‌ ప్రజాదరణ పొందడానికి కారణం అక్కడ వడ్డించే వైవిధ్యమైన దోసెలే. ఐస్‌క్రీం, లేస్‌, మామిడి, వైఫై దోసెలతోపాటు దాదాపు 26 రకాల్ని ప్రజలకు అందిస్తున్నారు అంజి హోటల్‌ నిర్వాహకులు. మనకు నచ్చిన ఆహార పదార్ధాలు చెబితే చాలు వాటితో దోసెలు వేసి మీతో ఆహా అనిపిస్తాం అంటున్నారు నిర్వాహకుడు అంజి.  

- టి. శారద, ఈనాడు పాత్రికేయ పాఠశాల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని