పండ్లని తడి లేకుండా చేస్తుంది!

బెండకాయల్లాంటి కాయగూరల్ని కడిగిన తర్వాత తడి లేకుండా ఉండేందుకు మళ్లీ పొడివస్త్రంతో తుడుస్తుంటాం. లేదంటే వండేటప్పుడు జిగురు వస్తుంది. ఇక పండ్లు, సలాడ్లలోకి వాడుకొనే ఆకుకూరల్ని కూడా బాగా కడిగిన తర్వాత తడిపోయేంతవరకూ ఎదురుచూడ్డమో,

Published : 19 Jun 2022 01:07 IST

బెండకాయల్లాంటి కాయగూరల్ని కడిగిన తర్వాత తడి లేకుండా ఉండేందుకు మళ్లీ పొడివస్త్రంతో తుడుస్తుంటాం. లేదంటే వండేటప్పుడు జిగురు వస్తుంది. ఇక పండ్లు, సలాడ్లలోకి వాడుకొనే ఆకుకూరల్ని కూడా బాగా కడిగిన తర్వాత తడిపోయేంతవరకూ ఎదురుచూడ్డమో, వస్త్రంతో తుడవడమో చేస్తుంటాం. ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది వెజిటబుల్‌, ఫ్రూట్‌ డీహైడ్రేటర్‌ పరికరం. బుట్టలాంటి ఈ పరికరంలో కాయగూరల్ని లేదా పండ్లని ఉంచి కడిగిన తర్వాత మూత పెట్టి పైన బటన్‌ నొక్కితే చాలు. లోపలున్న బుట్ట బొంగరంలా తిరిగి నీళ్లని బయటకు నెట్టేసి లోపలున్న వాటిని పొడిగా ఉంచుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని