పూల ఉప్పు!

నల్లుప్పు, కల్లుప్పు, రాతి ఉప్పుతోపాటు హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ వంటి రకాల గురించి కూడా మనకి తెలుసు. మరి పూల ఉప్పు గురించి విన్నారా? తినడానికి పనికొచ్చే పూల రకాలని ఎంపిక చేసి ప్రత్యేకమైన పద్ధతుల్లో వాటిని

Published : 19 Jun 2022 01:07 IST

ల్లుప్పు, కల్లుప్పు, రాతి ఉప్పుతోపాటు హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ వంటి రకాల గురించి కూడా మనకి తెలుసు. మరి పూల ఉప్పు గురించి విన్నారా? తినడానికి పనికొచ్చే పూల రకాలని ఎంపిక చేసి ప్రత్యేకమైన పద్ధతుల్లో వాటిని ఎండబెట్టి, వాటిని ఉప్పుకి కలపడం ద్వారా ఈ ఎడిబుల్‌ ఫ్లవర్‌ సాల్ట్‌లని తయారుచేస్తున్నారు. సలాడ్లు, ఇతర వంటకాలపై వీటిని చల్లడం వల్ల పదార్థాలకి కొత్త అందం రావడంతోపాటు... పోషకాలు పెరుగుతాయని అంటున్నారు తయారీదారులు.  కార్న్‌, జెరానియం, బంతి, గులాబీ, శంఖుపూలు వంటి వాటిని ఈ ఉప్పు తయారీకి వినియోగిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని