చెర్రీపూల పండగ చేసుకుంటారు

జపాన్‌ పేరుచెబితే లేత గులాబీరంగులో మనసు దోచుకొనే అందమైన చెర్రీపూలే గుర్తుకొస్తాయి కదా! ఆ దేశ జాతీయ పుష్పం కూడా ఈ చెర్రీపూల గుత్తులే. ఈ పూలని స్థానికంగా సకురా పూలు అని పిలుచుకుంటారు. మార్చి నుంచి మేనెల వరకూ ఈ పూలు విరగపూస్తాయి.

Updated : 19 Jun 2022 01:20 IST

పాన్‌ పేరుచెబితే లేత గులాబీరంగులో మనసు దోచుకొనే అందమైన చెర్రీపూలే గుర్తుకొస్తాయి కదా! ఆ దేశ జాతీయ పుష్పం కూడా ఈ చెర్రీపూల గుత్తులే. ఈ పూలని స్థానికంగా సకురా పూలు అని పిలుచుకుంటారు. మార్చి నుంచి మేనెల వరకూ ఈ పూలు విరగపూస్తాయి. ఆ సమయంలో వీటిని చూడ్డానికి ఎంతోమంది వస్తారు. వీటినే ‘హానామీ’ ఉత్సవాలంటారు. ఓపక్క చెర్రీ పూలవర్షం కురుస్తుంటే ఈ చెట్ల కింద కూర్చుని ఆ పూల వంటకాలనే తినడం ఈ పండగ ప్రత్యేకత. అయితే చెర్రీ పండ్లని ఇచ్చే పూలూ ఇవీ ఒకటి కాదు. ఈ పూలని అందం, ఆరోగ్యం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెర్రీపూలని ఉప్పు, వెనిగర్‌ వేసి నిల్వ చేస్తారు. దీంతో సకురా టీని తయారు చేస్తారు. వందేళ్లు వచ్చేంతవరకూ కూడా అందమైన చర్మంతో జీవించడానికి ఈ టీనే కారణమని చెబుతారు జపనీయులు. అలాగే ఈ పూలు, బియ్యపిండిని వాడి మోచి అనే వంటకాన్ని చేస్తారు. మూడురంగుల్లో కనిపించే లాలీపాప్‌లాంటి హనామీ డాంగో అనే వంటకాన్ని కూడా వండుతారు. కేవలం వంటకాలే కాదు వంటపాత్రలు కూడా ఈ చెర్రీపూల ఆకృతిలోనే ఉంటాయి. అంత ఇష్టం వాళ్లకి ఈ పూలంటే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని