పచ్చని ప్యాకింగ్‌!

కాలుష్యానికి చెక్‌పెట్టే ‘జీరోవేస్ట్‌’ జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా ఆహార పదార్థాల ప్యాకింగులో వస్తున్న మార్పులు ఆకర్షణీయంగానే కాదు ఆరోగ్యప్రదంగానూ ఉంటున్నాయి..  

Published : 26 Jun 2022 00:43 IST

కాలుష్యానికి చెక్‌పెట్టే ‘జీరోవేస్ట్‌’ జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా ఆహార పదార్థాల ప్యాకింగులో వస్తున్న మార్పులు ఆకర్షణీయంగానే కాదు ఆరోగ్యప్రదంగానూ ఉంటున్నాయి..  

తినడానికి బయట నుంచి ఏం కొనుక్కు తెచ్చుకున్నా అవి మన ఇంటికి చేరేది కచ్చితంగా ప్లాస్టిక్‌ బ్యాగులు, ప్లాస్టిక్‌ ప్యాకింగుల్లోనే. ఇక చాట్, భేల్‌పురీ వంటివి తినాలన్నా... తేలిగ్గా ఉండే స్టైరోఫోమ్‌ గిన్నెల్లోనే వడ్డిస్తున్నారు. కానీ ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమికి ఎంత చేటు చేస్తాయో తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారంగా... థాయిలాండ్, వియత్నాం, మలేషియా వంటి దేశాలు సూపర్‌మార్కెట్లలో ప్యాకింగ్‌ కోసం ప్లాస్టిక్, కాగితాలకు బదులుగా అరటి ఆకులని ఉపయోగిస్తున్నాయి. గుడ్లు వంటివి ప్యాక్‌ చేయడానికి వ్యర్థాలతో చేసిన కేసులని ఉపయోగిస్తున్నాయి. లేదా ఎండిన తీగలని, గడ్డిని ఇందుకోసం వాడుతున్నాయి. హోటళ్లూ, ఇళ్లలో కూడా వెదురు, ఆకుల్లో వడ్డిస్తూ ప్లాస్టిక్‌కి చెక్‌పెడుతున్నారు. ఆకుల్లో భోజనం ప్లాస్టిక్‌ గిన్నెల్లో వడ్డించినంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.. అందుకే వెదురుతో చేసిన బుట్టలు, వెదురుబొంగులని, కొబ్బరి చిప్పలని ఇందుకోసం వాడుతున్నారు. నూనెలు, పచారీ సరుకులని ప్లాస్టిక్‌ ప్యాకింగుల్లో ఇవ్వడానికి బదులుగా ఇంటి నుంచే డబ్బాలు తెచ్చుకొమ్మని రీఫిల్లింగ్‌ చేసి ఇస్తున్నాయి. చూడ్డానికీ బాగుంటుందీ ప్యాకింగ్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని