వియత్నాం...మనసుదోసెన్‌!

వియత్నాంలో ఏ వీధికయినా వెళ్లండి. ఏ ఇంటికైనా వెళ్లండి. సూపర్‌మార్కెట్‌, రెస్ట్రాంట్‌.. ఎక్కడికయినా సరే! పొద్దుట్నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకూ తెల్లని మంచుపొరలాంటి ఓ వంటకాన్ని వెదురు కర్రతో తిరిగేస్తూనో, దానికోసం పిండి కలుపుతూనో....

Published : 21 Jul 2019 00:26 IST

పరదేశి పసందు!

వియత్నాంలో ఏ వీధికయినా వెళ్లండి. ఏ ఇంటికైనా వెళ్లండి. సూపర్‌మార్కెట్‌, రెస్ట్రాంట్‌.. ఎక్కడికయినా సరే! పొద్దుట్నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకూ తెల్లని మంచుపొరలాంటి ఓ వంటకాన్ని వెదురు కర్రతో తిరిగేస్తూనో, దానికోసం పిండి కలుపుతూనో కనిపిస్తారు చాలామంది. స్థానికంగా ఈ వంటకాన్ని బాన్‌కుయోన్‌ అంటారు. ఇంగ్లిష్‌లో ‘రైస్‌ పేపర్స్‌’ అనీ ‘రైస్‌ షీట్స్‌’ అనీ అంటారు. చూడ్డానికి అచ్చంగా మన దోసె తీరుగానే ఉండే ఈ షీట్స్‌ తయారీ కాస్త వైవిధ్యంగానే ఉంటుంది.
బియ్యాన్ని రోజంతా నానబెట్టి... తర్వాత మెత్తగా రుబ్బుతారు. మనం ఇడ్లీలు తయారు చేసుకునే పాత్ర లాంటి దానికి కాటన్‌వస్త్రాన్ని కట్టి దానిమీద ఈ బియ్యప్పిండిని దోసెలా పోసి మూత పెట్టేస్తారు. ఇలా ఆవిరిమీద ఉడికిన రైస్‌షీట్స్‌ ఫ్రిజ్‌లో నాలుగురోజుల వరకూ నిల్వ ఉంటాయి. ఈ షీట్స్‌ మధ్యలో ఉడికించిన రొయ్యలు, చికెన్‌, కాయగూరముక్కలు పెట్టి మడత వేస్తారు. ఇవే షీట్స్‌ రెడీమేడ్‌గా కూడా దొరుకుతాయి. ఇంట్లో రైస్‌ రోల్స్‌ చేసుకునే ముందు.. ఈ షీట్స్‌ని రెండు నిమిషాలు నానబెడితే సరి. వియత్నామీ స్త్రీలు ఎక్కువ మంది వీటి తయారీతోనే ఉపాధి పొందుతున్నారు. ఇంట్లోనే తయారుచేసుకోవాలి అనుకునే వారికి బాన్‌కుయోన్‌ కిట్లు దొరుకుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని