పక్కాలోకల్‌: లుక్మీ

సికింద్రాబాద్‌ స్టేషన్లో దిగి ఎదురుగా అల్ఫాహోటల్‌ దగ్గర ఆగి వేడివేడిగా ఓ వెజ్‌ లుక్మీ తిని, చాయ్‌ తాగిన జ్ఞాపకం ఇంకా అలానే పదిలంగా ఉండిపోయిందా? మర్చిపోడానికి...

Published : 04 Nov 2018 00:07 IST

పక్కాలోకల్‌: లుక్మీ

సికింద్రాబాద్‌ స్టేషన్లో దిగి ఎదురుగా అల్ఫాహోటల్‌ దగ్గర ఆగి వేడివేడిగా ఓ వెజ్‌ లుక్మీ తిని, చాయ్‌ తాగిన జ్ఞాపకం ఇంకా అలానే పదిలంగా ఉండిపోయిందా? మర్చిపోడానికి అదేమన్నా మామూలు రుచామరి..

హైదరాబాద్‌ పేరు చెబితే ఘుమఘులాడే బిర్యానీ... ఆ వెనకే ఇరానీ చాయ్‌ సహా బోలెడు రుచులు వరసలో నిలబడతాయి. ఆ రుచుల్లో లుక్మీ కూడా ఒకటి. సమోసా అంటే మనకి మనసులో ఒక ప్రత్యేకమైన ఆకృతి ఎలా గుర్తుకొస్తుందో లుక్మీ అన్నా కూడా అంతే చక్కగా చతురస్రాకారంలో కత్తిరించి ముచ్చటగా ఉన్న అంచులతో చేసిన మటన్‌ కీమా ప్యాకెట్లు గుర్తుకొస్తాయి. లుక్మీ అనే పదం లుక్మా అనే ఉర్దూపదం నుంచి వచ్చిందట. చిన్నచిన్న తునకలుగా కొట్టిన మటన్‌ కీమాని నలుపలకల రోటీల్లో ఉంచి కరకరలాడేలా చేసే వంటకం లుక్మీ. ఒకప్పుడు ఇరానీ హోటల్స్‌లో మాత్రమే దొరికే ఈ రుచి ఇప్పుడు రెస్టారెంట్లలోనూ నోరూరిస్తోంది.

పక్కాలోకల్‌: లుక్మీ

పక్కాలోకల్‌: లుక్మీ

పక్కాలోకల్‌: లుక్మీ

ఫొటోలు: వసంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని