కోడిగుడ్డు గంటెప్ప!

గుడ్డుని చూస్తే దాంతో ఎన్నెన్ని ప్రయోగాలు చేయొచ్చా అని ఉబలాటపడతారు ‘ఎగ్‌టేరియన్లు’. అలాంటి వారు తెలుసుకోవాల్సిన  వంటకమే ఈ కోడిగుడ్డు గంటెప్ప....

Published : 03 Mar 2019 01:09 IST

ఆ‘పాత’ మధురం

గుడ్డుని చూస్తే దాంతో ఎన్నెన్ని ప్రయోగాలు చేయొచ్చా అని ఉబలాటపడతారు ‘ఎగ్‌టేరియన్లు’. అలాంటి వారు తెలుసుకోవాల్సిన  వంటకమే ఈ కోడిగుడ్డు గంటెప్ప....
పేరు విచిత్రంగా ఉంది కదూ! వంటకం కూడా భలే రుచిగా ఉంటుంది.. ఇప్పటి ఆధునిక వంటగదులకీ.. పాతకాలం నాటి కట్టెలపొయ్యికి పోలికే లేదు. అప్పట్లో వంట చేయాలంటే కట్టెలు లేదా బొగ్గులపైనే చెయ్యాల్సి వచ్చేది. ఒక్కసారి పొయ్యి ఊరుకుందా... తిరిగి పొయ్యి రాజెయ్యడం చాలా కష్టమైన పని. అందుకే చాలామంది ఆ నిప్పుల మీదే కొన్ని రకాల వంటకాలు చేసుకునేవారు. ‘కొప్పెర’ అని వేడినీళ్లు కాసుకొనే పాత్ర ఒకటి ఉంటుంది. ఉట్టప్పుడు ఈ బొగ్గుల వేడికి అందులోని నీళ్లు వేడెక్కుతూ ఉంటాయి. కావాల్సినప్పుడు కోడిగుడ్డు అట్టులాంటివి కూడా ఈ నిప్పులమీదే కాల్చేవారు. ఇప్పట్లా ఎప్పుడంటే అప్పుడు మాంసం దొరికేది కాదు. నాన్‌వెజ్‌ అంటే నాటు కోడిగుడ్డే. దాన్ని కూడా పెనం పైన కాకుండా ఈ బొగ్గులపైన చారుపోపు కోసం వాడే ఒక చిన్నగంటెను ఉంచి అందులో గుడ్డు పగలకొట్టి వేస్తారు. కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, మసాలాపొడి చల్లుతారు. తిరగేసి మళ్లీ ఉప్పు, కారం, మసాలాపొడి చల్లితే కోడిగుడ్డు గంటెప్ప రెడీ! దీనినే ఇప్పుడు ‘ఫ్రైడ్‌ ఎగ్‌’ అంటున్నారు. తక్కువ కెలొరీలు... ఎక్కువ పోషకాలు. బాగుంది కదూ!

- జ్యోతి వలబోజు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని