నాన్‌వెజ్‌ లా..లాంటివి!

నాన్‌వెజ్‌ తినడం అంటే జీవహింసకు పాల్పడటం మాత్రమే కాదు... పర్యావరణానికీ చేటుచేయడమే అంటోంది ఉదయ్‌పూర్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ ‘గుడ్‌డాట్‌’....

Published : 10 Mar 2019 00:56 IST

ట్రెండుగురూ!

నాన్‌వెజ్‌ తినడం అంటే జీవహింసకు పాల్పడటం మాత్రమే కాదు... పర్యావరణానికీ చేటుచేయడమే అంటోంది ఉదయ్‌పూర్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ ‘గుడ్‌డాట్‌’. అందుకే మాంసాహార రుచులకు ప్రత్యామ్నాయంగా మొక్కల నుంచి సేకరించిన మాంసకృత్తులతో వినూత్నంగా ‘వెజిటేరియన్‌ నాన్‌వెజ్‌’ని తయారుచేసింది. దీంతో కీమా బర్గర్లు, బుర్జీ బర్గర్లు, ఫ్రైడ్‌ క్రిస్పీ వంటి వివిధ రకాల రుచులని నోరూరేలా చేసి అందిస్తోంది. రుచి, పోషకాల్లో అచ్చంగా మాంసాహారాన్ని పోలిన ఈ రుచుల వల్ల ఆరోగ్యం, పర్యావరణం రెండూ బాగుంటాయని అంటున్నారు తయారీదారులు. గోధుమలు, సోయా, ఆలూ, చిక్కుడు వంటి మొక్కల నుంచి ఈ ప్రొటీన్లను సేకరిస్తున్నారు. సాధారణంగా నాన్‌వెజ్‌ ఉత్పత్తులని తెలియచేయడానికి ఎర్రని చుక్క వాడతారు. అదే శాకాహార ఉత్పత్తి అయితే పచ్చని చుక్క వాడతారు. ఇవి మాంసాహారానికి ప్రత్యామ్నాయం అందించే ఉత్పత్తులు కాబట్టి గుడ్‌డాట్‌ అనే పేరు పెట్టాం అంటున్నారు సంస్థ సీఈవో అభిషేక్‌ సిన్హా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని