గుంటగలగరాకు పచ్చడి!

గుంటగలగరాకు పచ్చిది దొరికితే రుబ్బి తలకు పెట్టుకుంటారు. ఆ భాగ్యం లేకపోతే మార్కెట్లో దొరికే పొడి తెచ్చుకుని నూనెలో మరిగించుకుంటారు. ఇదంతా ఎందుకంటే... ఈ ఆకులు తలవెంట్రుకలని నల్లబరిచి జుట్టుని పొడవుగా ఎదిగేటట్టు చేస్తాయి. ఆ ఆకులని ఆహారంగా తీసుకున్నా మంచిదే....

Published : 05 May 2019 00:29 IST

శిరోజాల ప్రత్యేకం!

గుంటగలగరాకు పచ్చిది దొరికితే రుబ్బి తలకు పెట్టుకుంటారు. ఆ భాగ్యం లేకపోతే మార్కెట్లో దొరికే పొడి తెచ్చుకుని నూనెలో మరిగించుకుంటారు. ఇదంతా ఎందుకంటే... ఈ ఆకులు తలవెంట్రుకలని నల్లబరిచి జుట్టుని పొడవుగా ఎదిగేటట్టు చేస్తాయి. ఆ ఆకులని ఆహారంగా తీసుకున్నా మంచిదే. రక్తాన్ని శుద్ధి చేసే వీటితో పచ్చడి చేసుకుంటే ఎంతో మంచిది...

కావాల్సిన పదార్థాలు: గుంటగలగర ఆకులు- ఒక కట్ట(పెద్దది), ఎండుమిర్చి- 20గ్రా, పచ్చిమిర్చి- 15, ఆవాలు- చెంచా, నువ్వులు- చెంచా, మెంతులు- అరచెంచా, మినప్పప్పు- చెంచా, చింతపండు- నిమ్మకాయంత, నూనె- 100గ్రా, ఇంగువ- అరచెంచా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం: ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి ఎండుమిర్చి, ఆవాలు, నువ్వులు, మెంతులు, మినప్పప్పులను నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. ఆకులని పైపైన నూనెలో వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న పోపులో పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. చివరిగా ఆకు వేసి మెత్తగా రుబ్బి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి 100 గ్రాముల నూనె, అరచెంచా ఇంగువ వేసి కాగిన తర్వాత ఈ నూనెను పచ్చడిలో వేసి కలుపుకోవాలి. మంచి రుచితోపాటు ఆరోగ్యాన్నీ అందించే గుంటగలగర ఆకు పచ్చడి రెడీ. దీంతో పులుసుకూర కూడా చేసుకుంటారు.

- బండ్రెడ్డి పద్మావతి, కొవ్వూరు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని