నోరూరించే క్యారెట్‌ డిలైట్‌

కావాల్సినవి:  క్యారెట్‌- 500 గ్రా., చక్కెర- అర కప్పు, మొక్కజొన్న పిండి, నెయ్యి- పావు కప్పు చొప్పున, పాలు- కప్పు, ఉప్పు- చిటికెడు, యాలకుల పొడి- పావు చెంచా.

Published : 02 Jan 2022 01:12 IST

కావాల్సినవి:  క్యారెట్‌- 500 గ్రా., చక్కెర- అర కప్పు, మొక్కజొన్న పిండి, నెయ్యి- పావు కప్పు చొప్పున, పాలు- కప్పు, ఉప్పు- చిటికెడు, యాలకుల పొడి- పావు చెంచా.
తయారీ: క్యారెట్‌ను కుక్కర్‌లో వేసి రెండు కూతలు వచ్చే వరకు ఉడికించాలి. దీన్ని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని  వడకట్టాలి. ఆ తర్వాత దీంట్లో చక్కెర, మొక్కజొన్న పిండి, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి, కాసిన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని వేసి అయిదు నిమిషాలు నెమ్మదిగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. దాంతో మిశ్రమం చిక్కగా అవుతుంది. మధ్య మధ్యలో కాస్తంత నెయ్యిని వేస్తూ ఉడికించాలి. మిశ్రమం మరికాస్త దగ్గర పడ్డాక మందంగానున్న పళ్లానికి నెయ్యి రాసి దాంట్లో తీసుకోవాలి. గంట తర్వాత నచ్చిన ఆకారంలో కోసుకోవాలి. ఈ ముక్కలను ఎండుకొబ్బరి పొడిలో దొర్లించి, టూటీఫ్రూటీలతో అలంకరిస్తే సరి.

చెఫ్‌ స్పెషల్‌     

- పవన్‌ సిరిగిరి, చెఫ్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని