భోగిచీ భాజీ

ఈ వంటకాన్ని మహారాష్ట్రలో సంక్రాంతికి ముందు రోజు అంటే భోగినాడు వండుతారు. చలికాలంలో దొరికే కూరగాయలతో దీన్ని తయారుచేస్తారు. ముఖ్యంగా నువ్వులు, ఎండు కొబ్బరిని ప్రధానంగా వాడతారు. మరి ఆ పొరుగు రుచిని మనమూ ఆస్వాదిద్దామా..

Published : 09 Jan 2022 01:07 IST

(సంక్రాంతి ప్రత్యేక వంటకం)

ఈ వంటకాన్ని మహారాష్ట్రలో సంక్రాంతికి ముందు రోజు అంటే భోగినాడు వండుతారు. చలికాలంలో దొరికే కూరగాయలతో దీన్ని తయారుచేస్తారు. ముఖ్యంగా నువ్వులు, ఎండు కొబ్బరిని ప్రధానంగా వాడతారు. మరి ఆ పొరుగు రుచిని మనమూ ఆస్వాదిద్దామా..

కావాల్సినవి: రేగుపండ్లు- కప్పు, పల్లీలు- పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు- ఏడెనిమిది, వంకాయలు- రెండు, చిక్కుడు కాయలు, బీన్స్‌- అయిదారు; క్యారెట్‌, ఆలు- ఒక్కోటి, పచ్చిమిర్చి- నాలుగు, చిక్కుడు గింజలు, సెనగలు- పావు కప్పు చొప్పున, నూనె- తగినంత, జీలకర్ర, ఆవాలు- చెంచా, పసుపు- అర చెంచా, ఉప్పు- సరిపడా, గోడ మసాలా, నువ్వులు- రెండు చెంచాల చొప్పున, కొత్తిమీర తురుము- కొద్దిగా. తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టి పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించాలి. ఆ తర్వాత నువ్వులు వేసి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి పొడి చేసుకోవాలి. కూరగాయలన్నింటినీ ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, నువ్వులు వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు, పసుపు, ఉప్పు చేర్చి మూత పెట్టి మగ్గించాలి. అవి కాస్త ఉడికిన తర్వాత చిక్కుడు గింజలు, పచ్చిసెనగలు, కొన్ని నీళ్లు పోసి, మహారాష్ట్ర ప్రత్యేకమైన గోడ మసాలా వేసి కాసేపు ఉడికించాలి. ఇందులో రేగు పండ్లు, పల్లీల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. దీన్ని గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని