నిద్రపట్టడం లేదా?

రోజూ గుప్పెడు ఫూల్‌మఖనా తింటే వయసు వెనక్కి మళ్లుతుందట. అదెలా అంటారా? దానిలోని పోషకాలకు గురించి తెలిస్తే మీరూ అవుననే అంటారు...

Updated : 17 Jul 2022 06:44 IST

రోజూ గుప్పెడు ఫూల్‌మఖనా తింటే వయసు వెనక్కి మళ్లుతుందట. అదెలా అంటారా? దానిలోని పోషకాలకు గురించి తెలిస్తే మీరూ అవుననే అంటారు...

* ఫూల్‌మఖనా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ముఖ్యంగా గాలిక్‌యాసిడ్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనేవి చర్మాన్ని మెరిసేటట్టు చేస్తాయట. అందువల్లే వయసు తగ్గిన భావన కలుగుతుంది. అయితే నూనెలో కాకుండా మామూలుగా వేయించుకుని తింటే ఎక్కువ ఫలితాలు పొందొచ్చు.

* గుండెజబ్బులున్న వారికీ, మధుమేహులకు ఇది మంచి చిరుతిండి. కారణం ఇందులో హానికారక శాచురేటెడ్‌ కొవ్వు తక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్య రాదు.

* దీనిలోని గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయి చాలా తక్కువ. ఆ కారణం వల్లనే కాసిని తిన్నా కడుపునిండిన భావన కలిగి.. అనవసరంగా ఏదో ఒకటి తినాలనే ఆలోచనని నియంత్రిస్తుంది. ఆ రకంగా మన బరువు అదుపులో ఉంటుంది.

* చాలామందిలో ఆందోళన, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలుంటాయి. చాలావరకూ ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి నిదురపోయేముందు ఓ చిన్నగ్లాసు పాలతోపాటు వీటిని కూడా కలిపి తీసుకుంటే నిద్ర సమస్యలన్నీ తీరిపోతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేసే శక్తి వీటికి ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని