Published : 31 Jul 2022 00:52 IST

పిల్లల్ని చురుగ్గా ఉంచే... పనీర్‌!


పనీర్‌తో చేసిన కూరలంటే లొట్టలేసుకుని తింటారు కొందరు. పనీర్‌తో చేసిన వంటకాలు రుచికరమే కాదు... ఆరోగ్యదాయకం కూడా!
* క్యాల్షియం, డి విటమిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలహీనంగా ఉండే పిల్లలు, మహిళలకు ఇది మంచి ఆహారం. పనీర్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే గుల్లబారిన ఎముకలు గట్టిపడతాయి. రొమ్ముక్యాన్సర్‌ని అదుపులో ఉంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
* పనీర్‌తో మనలో వ్యాధినిరోధకశక్తిని పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ దొరుకుతుంది.
* పిల్లలు చురుగ్గా లేకపోయినా, జ్ఞాపకశక్తి లేకపోయినా.. వాళ్లకి పనీర్‌ వంటకాలని తినిపించండి. దీనిలోని ఒమెగా-త్రీ పిల్లల్లో చురుకుదనం పెంచుతుంది.
* విటమిన్‌ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* సలాడ్లు, కూరలు, చిరుతిళ్లలో పనీర్‌ని భాగం చేస్తే బరువు తగ్గడం తేలిక అవుతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని