26 వంటకాల సాద్య!

కేరళలో ఓనమ్‌ పర్వదినాలు ప్రారంభమయ్యాయి. మనకి సంక్రాంతి ఎలానో.. కేరళీయులకి ఈ ఓనమ్‌ పండగ అలా.

Published : 04 Sep 2022 00:27 IST

కేరళలో ఓనమ్‌ పర్వదినాలు ప్రారంభమయ్యాయి. మనకి సంక్రాంతి ఎలానో.. కేరళీయులకి ఈ ఓనమ్‌ పండగ అలా. పదిరోజుల పాటు సాగే ఈ పండగరోజుల్లో సాద్య పేరుతో సంప్రదాయ వంటకాలని వండివారుస్తారు. సాద్యని ఏవో రెండు మూడు వంటకాలతో సరిపెడతారు అనుకొంటే పొరపాటు. కొబ్బరి, బెల్లం, కంద వంటి స్థానికంగా దొరికే 60 రకాల పదార్థాలతో 26 రకాల సంప్రదాయ వంటకాలని చేసి అరిటాకులో వడ్డిస్తారు. ఉప్పేరి (అరిటికాయ చిప్స్‌), షక్కర వరాట్టి(అరటికాయ తీపి చిప్స్‌), నారంగ(నిమ్మకాయ పచ్చడి), కొబ్బరినూనెతో చేసిన అవియల్‌, క్యాబేజీలో కొబ్బరికోరు వేసి చేసిన తోరన్‌, పరిప్పు(పెసరపప్పు సలాడ్‌), పెరుగు, కందతో చేసిన కాలన్‌, అరటికాయ కూటు వంటి 26 వంటకాలు చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని