వెతకండి.. వండండి!

మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అనే స్పృహ చాలామందిలో పెరుగుతోంది. దాంతో ఆరోగ్యానికి దోహదం చేసే వివిధ రకాల ఆహార నియమాలు, పద్ధతులు మొదలవుతున్నాయి. అలా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానమే ఫోరేజింగ్‌.

Published : 18 Sep 2022 00:51 IST

మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అనే స్పృహ చాలామందిలో పెరుగుతోంది. దాంతో ఆరోగ్యానికి దోహదం చేసే వివిధ రకాల ఆహార నియమాలు, పద్ధతులు మొదలవుతున్నాయి. అలా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానమే ఫోరేజింగ్‌. అంటే స్థానికంగా దొరికే ఆహారాన్ని అన్వేషించి, తెచ్చుకోవడం. దాన్ని అలానే తాజాగా వండుకోవడం. పూర్వం రోజుల్లో అయితే అడవులు, పొలాల్లో గట్లమీద పండిన ఆహారాన్ని ఈ పద్ధతిలోనే తెచ్చుకొని వండుకొనేవాళ్లం. ఇప్పుడు అడవులూ లేవు.. మందుల్లేకుండా పండించే పంటలూ లేవు. అందుకే  విదేశాల్లో చాలా హోటళ్లు.. మెనులో ఈ ఫోరేజింగ్‌ ఆహారాన్ని అందిస్తున్నాయి. హోటల్‌కి అనుసంధానంగా వ్యవసాయ క్షేత్రాలని ఏర్పరచుకుని అక్కడ మందులు వేయకుండా ఆహారానికి పనికొచ్చే అనేక మొక్కలని కలగాపులగంగా పెంచుతారు. అంటే పుట్టగొడుగులు, అల్లం, పసుపు, ఆకుకూరలు ఇలా బోలెడు కాయగూరలు పెంచుతారు. హోటల్‌కి వచ్చిన వారు ఇష్టమైతే ఆహారాన్ని అన్వేషించి నచ్చిన వాటిని తెచ్చిస్తే వాటినే తాజాగా, రుచికరంగా వండిపెడతారు. లేదంటే మెనూలోని ఉన్న దాన్ని ఎంచుకొంటే హోటల్‌ వాళ్లే అప్పటికప్పుడు తెచ్చివండుతారు. అంటే పెరటి నుంచి కంచంలోకి నేరుగా వస్తాయన్నమాట. విదేశాల్లో మొదలైన ఈ ట్రెండు ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని చోట్ల అనుసరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని