వెదురు సాంబారు..చామాకు పొట్లాలు!

చామాకుతో చేసిన పొట్లాలు, వెదురుతో చేసిన సాంబారు... సింగాడా దుంపలతో చేసిన బర్ఫీలు. ఇవన్నీ ఎక్కడి ప్రత్యేకమో తెలుసా? ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా చెప్పుకొనే ఛత్తీస్‌గఢ్‌ క్యుజీన్‌ ప్రత్యేకం. రుచికరమైన గిరిజన వంటకాలకూ ఈ ప్రాంతం పెట్టింది పేరు..

Updated : 02 Oct 2022 04:03 IST

చామాకుతో చేసిన పొట్లాలు, వెదురుతో చేసిన సాంబారు... సింగాడా దుంపలతో చేసిన బర్ఫీలు. ఇవన్నీ ఎక్కడి ప్రత్యేకమో తెలుసా? ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా చెప్పుకొనే ఛత్తీస్‌గఢ్‌ క్యుజీన్‌ ప్రత్యేకం. రుచికరమైన గిరిజన వంటకాలకూ ఈ ప్రాంతం పెట్టింది పేరు..

వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి బియ్యప్పిండితో అనేక రకాల వంటకాలు చేస్తారు. ఆకుకూరలు, దుంపలు, వెదురు చిగుళ్లతో బియ్యప్పిండిని కలిపి చేసే వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అమిటీ.. ఈ వంటకాన్ని ఛత్తీస్‌గఢ్‌ సాంబార్‌ అంటారు. ఇది బస్తర్‌ ప్రత్యేకం. అన్ని కాయగూరలు, పప్పుతోపాటు వెదురు చిగుళ్లు కూడా వేసి ఈ దీనిని తయారుచేస్తారు. ఇక చెరువుల్లో దొరికే నీటి దుంపల్ని సింగాడాలని అంటారు. వాటిని మరపట్టి దాని పిండితో చేసే సింగాడా బర్ఫీలు దేశంలో మరే ప్రాంతంలో దొరకవు. ఆటాతో కాకుండా బియ్యప్పిండితో చేసే ఫరాలని లోకల్‌ మోమోలు అంటారు. ఆవిరిమీద ఉడికించే ఈ వంటకం ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. లేత చామాకులని, సెనగపిండిని పొరపొరలుగా వేసి చేసే ‘కొచ్చయి పట్టా’ అయితే ఈ క్యుజిన్‌కే అత్యంత ప్రత్యేకమైన వంట. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా మహువా పూలు పూస్తుంటాయి. వీటితో జ్యూస్‌ తయారు చేస్తారు. ఎక్కువ నూనె వాడకుండా... ఆవిరిమీద ఉడికించి, నువ్వులని ఎక్కువగా వాడి ఈ వంటకాలు చేస్తారు. అన్నట్టు చీమలతో చేసే రెడ్‌ ఆంట్‌ చట్నీ కూడా ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని