మోతీచూర్‌ లడ్డూ చేస్తున్నారా?

మోతీచూర్‌ లడ్డూ తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరుకూడా బజారులో దొరికే వాటిల్లానే అందంగా తయారుచేయొచ్చు. బూందీ సైజు సన్నగా ఉండాలి.

Published : 23 Oct 2022 00:38 IST

మోతీచూర్‌ లడ్డూని ఎన్నిసార్లు ప్రయత్నించినా సరిగా రావడం లేదు. అవి బాగా రావడానికి ఏవైనా చిట్కాలుంటే చెప్పండి?

- మేఘన, విజయవాడ

మోతీచూర్‌ లడ్డూ తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరుకూడా బజారులో దొరికే వాటిల్లానే అందంగా తయారుచేయొచ్చు. బూందీ సైజు సన్నగా ఉండాలి. అలా ఉండాలంటే మామూలు గరిటెలు పనికిరావు. బజారులో ప్రత్యేకంగా ఇందుకోసం గరిటెలు అమ్ముతారు. అవి కొనండి. మామూలు మిఠాయి రంగుకి బదులు... కుంకుమపువ్వుని వాడి చూడండి. దీని పరిమళం, రంగు, రుచి ప్రత్యేకంగా ఉంటాయి. ఇక పిండిని తడిపేటప్పుడు మరీ పల్చగానూ, మరీ గట్టిగానూ కాకుండా కలపాలి. ఉండల్లేకుండా చూసుకోవాలి. ఇక పాకం విషయానికొస్తే తీగపాకం రానిచ్చి మరీ చిక్కగా అయిపోకుండా దింపేసుకోవాలి. లేదంటే లడ్డు చుట్టడం కష్టమవుతుంది. బూందీని పాకంలో కలిపేటప్పుడు కచ్చితంగా పాకం గోరువెచ్చగా ఉండాలి. బూందీ వేయించేలోపు పాకం చల్లబడకుండా ఉండాలంటే వేడినీళ్లలో పాకం గిన్నెను ఉంచితే సరిపోతుంది. అలాగే నూనె వేడి చూసుకొనే బూందీని వేయించుకోవాలి. కొద్దిగా బూందీని వేసినప్పుడు నూనెలో వెంటనే పైకి తేలితే అది సరైన పదును. అలాగే బూందీని మరీ కరకరలాడేలా వేయించకూడదు. దోరపదును చాలు. ఇలాంటి బూందీ పాకంలో సరిగ్గా కలుస్తుంది. ఒకవేళ బూందీ సైజు పెద్దగా అనిపిస్తే మిక్సీలో సన్నగా ఆడించవచ్చు. చేతికి నెయ్యి రాసుకొని... దోసగింజలు అద్ది లడ్డూలు చుడితే రుచిగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని