చలికి మందు... సర్‌సోంకాసాగ్‌!

దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచే ఉత్తరాది ఇళ్లలో సందడి చేసే అద్భుతమైన వంటకం సర్‌సోంకాసాగ్‌.

Published : 30 Oct 2022 00:15 IST

దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచే ఉత్తరాది ఇళ్లలో సందడి చేసే అద్భుతమైన వంటకం సర్‌సోంకాసాగ్‌. శీతాకాలం అంతా ‘సర్‌సోంకాసాగ్‌...మక్కీకీరోటీ’ అని గడిపేస్తారు ఉత్తర భారతీయులు..  ఆవ ఆకు మరికొన్ని ఆకుకూరలతో కలిపి చేసే వంటకాన్ని సర్‌సోంకాసాగ్‌ అంటారు. సర్‌సోం అంటే ఆవాలు. ఆవాల ఆకుతో చేస్తారు కాబట్టి దీనికా పేరు వచ్చింది. ఇది పంజాబీ వంటకమే అయినా దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, జమ్ము ప్రాంతాల్లోకూడా  చాలా ఇష్టంగా, ఎక్కువగా తింటారు. ఈ కాలం మొదలయ్యిందంటే దిల్లీ మండీలు ఈ వంటకానికి కావాల్సిన ఆకు కూరలతో కిక్కిరిసి ఉంటాయట. ఆవాకు, పాలకూర, మెంతికూర, ఇంకా మరికొన్ని ఆకుకూరలు అల్లం, వెల్లుల్లి కలిపి ఒక కిట్‌లా అమ్ముతారు. ఒక కిలో ఆవ ఆకుకి అరకిలో తక్కిన ఆకుకూరలు కలుపుతారు. ఈ సీజన్‌లో ఏ దాబాలో అడుగుపెట్టినా వెన్నవేసి వేడివేడిగా ఈ వంటకాన్ని వడ్డిస్తారట. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ వంటని పవర్‌హౌస్‌ వంటకం అంటారు. పంజాబీలకు సాక్‌.. సాగ్‌ ఈ రెండూ ఉంటే చాలట. సాక్‌ అంటే బంధువులు... సాగ్‌ అంటే ఈ కూర. ఇంత చెప్పాక మీకూ తినాలని ఉందా? ఆన్‌లైన్‌లో ఈ కూరని అమ్ముతున్నారు. తెచ్చుకుని తాలింపు వేసుకోండి చాలు. కాస్త వెన్న తగిలిస్తే అదుర్సే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని