వయసు తగ్గించే బచ్చలికూర!

రక్తహీనత ఉన్నప్పుడు దేనిమీదా దృష్టిపెట్టలేం. అసహనం, చికాకు వేధిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బచ్చలికూర మంచి పరిష్కారం.

Published : 13 Nov 2022 00:10 IST

* రక్తహీనత ఉన్నప్పుడు దేనిమీదా దృష్టిపెట్టలేం. అసహనం, చికాకు వేధిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బచ్చలికూర మంచి పరిష్కారం. కారణం... ఇందులో ఇనుము పుష్కలంగా ఉండి ఎనీమియా నుంచి కాపాడుతుంది.
*కొంతమంది తమ వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తుంటారు. మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీరాడికల్స్‌ అనే కణాలే ఇందుకు కారణం. వీటికి వాతావరణంలోని కాలుష్యం కూడా తోడైతే చర్మ సమస్యలు, గుండె జబ్బులు వంటివి వస్తాయి. బచ్చలి కూర తినడం వల్ల ఫ్రీరాడికల్‌ కణాల విడుదల అదుపులో ఉంటుంది. అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది.  
* మనం తీసుకొనే ఆహారంలో ఫొలేట్‌ విటమిన్‌ తగ్గినప్పుడు.. గుండె జబ్బులు రావడం, రొమ్ముక్యాన్సర్‌, అల్జీమర్స్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే బచ్చలికూరని వారానికోసారైనా మీ ఆహారంలో చేర్చుకోండి. ఫొలేట్‌ లోపం రాదు. గర్భిణిగా ఉండగా ఈ కూరని తింటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది.
ఎక్కువ తింటే: కూర ఎంత రుచిగా ఉన్నా ఎక్కువ తినకూడదు.  కడుపు ఉబ్బరం కలుగుతుంది. కొంతమందిలో అలెర్జీలకు కూడా కారణమవుతుంది. అలాగే ఇతర పోషకాలని శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని