వేడి పుట్టించే గోంద్‌ లడ్డూ

గోంద్‌ లడ్డు గురించి విన్నారా? శీతాకాలంలో దీన్ని ఒంట్లో వేడి పుట్టించడానికి వాడతారు. ఉదయం పూట వేడిపాలు.. ఒక గోంద్‌ లడ్డు తింటే చలి నుంచి రక్షణగా ఉంటుందని నమ్ముతారు.

Updated : 20 Nov 2022 06:40 IST

గోంద్‌ లడ్డు గురించి విన్నారా? శీతాకాలంలో దీన్ని ఒంట్లో వేడి పుట్టించడానికి వాడతారు. ఉదయం పూట వేడిపాలు.. ఒక గోంద్‌ లడ్డు తింటే చలి నుంచి రక్షణగా ఉంటుందని నమ్ముతారు. ఔషధ విలువలున్న ఈ లడ్డూ గురించి తెలుసుకుందాం..

* గోంద్‌ చెట్టు బెరడు నుంచి తీసే ఒకరకం జిగురు. దీనికి రుచి వాసన ఉండవు. చూడ్డానికి లేత గులాబీ లేదా గోధుమరంగులో క్రిస్టల్స్‌ మాదిరిగా ఉంటుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాన్ని కొబ్బరి, బాదం, ఇతర ఎండుఫలాలతో కలిపి ఈ లడ్డూలు చేస్తారు. వీటిని శీతాకాలంలో రోజుకొకటి తింటే మంచిది.

* గర్భిణులు, బాలింతలకు ఈ లడ్డు ఎంతోమేలు చేస్తుంది.. అందుకే పోపులపెట్టెలో ఈ గోంద్‌ పలుకులని కూడా తప్పనిసరిగా ఉంచుతారు తల్లులు. క్యాల్షియం, ప్రొటీన్‌ పుష్కలంగా అందించే ఈ లడ్డూ బాలింతలకు ఎక్కువ మేలు చేస్తుంది. నడుం నొప్పిని నివారిస్తుంది. పాలు వృద్ధి చెందేలా చేస్తుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యేవాళ్లు దీన్ని తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

* ఎముకలు, కీళ్లనొప్పులతో బాధపడేవారు ఈ గోంద్‌ లడ్డుని తింటే ఉపశమనం కలుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని