ఆ బియ్యం మాయ చేస్తాయి..

అసోమీల పాకశాలలో బియ్యం, బియ్యప్పిండితో చేసిన వంటకాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సంక్రాంతికి మనం పాలల్లో బియ్యం వేసి పరమాన్నం వండితే వాళ్లు కాస్త భిన్నంగా బియ్యప్పిండితో అట్లు పోసి మధ్యలో రకరకాల తీయని పదార్థాలతో నింపుతారు. వీటిని పిటా అంటారు.

Published : 08 Jan 2023 00:33 IST

సోమీల పాకశాలలో బియ్యం, బియ్యప్పిండితో చేసిన వంటకాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సంక్రాంతికి మనం పాలల్లో బియ్యం వేసి పరమాన్నం వండితే వాళ్లు కాస్త భిన్నంగా బియ్యప్పిండితో అట్లు పోసి మధ్యలో రకరకాల తీయని పదార్థాలతో నింపుతారు. వీటిని పిటా అంటారు. ముఖ్యంగా బోకాసాల్‌ రకం బియ్యాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. ఈ బియ్యాన్ని వండాల్సిన అవసరం లేదు. నీళ్లు పోసి వదిలేస్తే అదే అన్నంగా మారుతుంది. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యప్పిండితో అట్లు పోసి మధ్యలో నల్ల నువ్వులు, బెల్లం లేదా చెరకు పాకం నింపి తిల్‌ పిటా వంటకాన్ని వండుతారు. ఈ బియ్యప్పిండితో రకరకాల అట్లు పోస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని