చిక్కులు తప్పిస్తాయ్‌!

ఈ సీజన్‌లో దొరికే చిక్కుళ్లని కొంతమంది ఎంత ఇష్టంగా తింటారో మరికొందరు అంత నిర్లక్ష్యం చేస్తారు. కానీ వీటిల్లో పోషకాల గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు...

Published : 08 Jan 2023 00:33 IST

ఈ సీజన్‌లో దొరికే చిక్కుళ్లని కొంతమంది ఎంత ఇష్టంగా తింటారో మరికొందరు అంత నిర్లక్ష్యం చేస్తారు. కానీ వీటిల్లో పోషకాల గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు...

చిక్కుళ్లని పోషకాల గనిగా చెప్పుకోవచ్చు. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి.. గ్యాస్‌, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. దాంతో అధిక బరువు తగ్గుతుంది. చెడు కొలెస్టాల్ర్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గి.. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా సజావుగా జరుగుతుంది.  

* మధుమేహం ఉండేవారు చిక్కుళ్లని ఆహారంలో చేర్చుకుంటే షుగర్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. వీటిల్లో ఐరన్‌, కాల్షియం అధికంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు చిక్కుడు గింజలతో చేసిన కూరలు తింటే మంచిది. వీటిల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇది. మనలో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

చిక్కులు తప్పిస్తాయ్‌!   చిక్కుడు గింజల్లో ఫొలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు.. అవయవాలు, మెదడు అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తుంది. గర్భం ధరించిన తొలినాళ్లలో చిక్కుడు కాయలు తినడం వల్ల.. శిశువుకి న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ రాకుండా ఉంటాయి.

* పార్కిన్‌సన్స్‌ వ్యాధి ఉన్నవారిలో... మెదడులో డోపమైన్‌ని విడుదల చేసే కణాలు మరణిస్తుంటాయి. తిరిగి ఆ కణాలు ఉత్పత్తి అయ్యేందుకు మందులు ఇస్తుంటారు. ఇలాంటి వారు చిక్కుళ్లు తినడం వల్ల కాస్త ఉపశమనం దొరుకుతుందట. చిక్కుళ్లలో ఉండే ఎల్‌- డోపా అనే రసాయనమే ఇందుకు కారణమని పరిశోదనలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని