సమోసా బిర్యాని తెలుసా!

వంటల్లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ మన్ననలు పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. దిన్నే వ్యాపకంగా మార్చుకుని రొటీన్‌కు భిన్నంగా ఆహారాన్ని అందిస్తున్న వారు కోకొల్లలు.

Published : 02 Apr 2023 00:17 IST

వంటల్లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ మన్ననలు పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. దిన్నే వ్యాపకంగా మార్చుకుని రొటీన్‌కు భిన్నంగా ఆహారాన్ని అందిస్తున్న వారు కోకొల్లలు. ఎవరి పంథాలో వారు నచ్చిన వంటకాన్నీ చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అందులో ఒకటే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదే సమోసా బిర్యాని..!

వేడి వేడి సమోసాను చూస్తే... ఆవురావురమంటూ ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. తలచుకుంటేనే నోటిలో నీళ్లు ఊరుతుంటాయి కొందరికి. మరి బిర్యాని గురించి చెప్పనక్కర్లేదు. బిర్యాని ప్రియులకి కొదవే లేదు. ఈ రెండు వంటకాల్లో దేని ప్రత్యేకత దానిదే. కానీ రెండు కలిపి చేసిన వంటకమే సమోసా బిర్యాని. ఇదేం కొత్త వంట అనుకోకండి... సమోసాలో ఆలూ, ఉల్లి, చికెన్‌, మొక్కజొన్న గింజలు స్టఫ్‌గా చేర్చడం ఒకప్పటి మాట. బిర్యాని చేర్చడం నేటి ట్రెండ్‌. భిన్న రుచులను ఏకం చేస్తూ వచ్చిన ఈ వంటకానికి కొందరు నెటిజన్లు ఆహా అంటుంటే మరికొందరు మాత్రం బిర్యానీ పరువు తీశారు అంటూ బాధపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని