ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోండి!

ఏది తినాలి? ఏది తినకూడదు ఈ విషయంలో మనకి చాలా సందేహాలు ఉంటాయి. అన్నం తినకూడదు, నెయ్యి తింటే ఒళ్లు వస్తుంది, బరువు తగ్గాలంటే ఉపవాసం ఉండాలి

Published : 02 Apr 2023 00:17 IST

ఏది తినాలి? ఏది తినకూడదు ఈ విషయంలో మనకి చాలా సందేహాలు ఉంటాయి. అన్నం తినకూడదు, నెయ్యి తింటే ఒళ్లు వస్తుంది, బరువు తగ్గాలంటే ఉపవాసం ఉండాలి ఇలాంటి అభిప్రాయాల్లో నిజమెంతో చెబుతోంది ప్రముఖ సెలబ్రిటీ డైటీషియన్‌ రుజుతా దివేకర్‌..

అన్నాన్ని మనం ఎన్నో తరాలుగా తింటున్నాం. మన అమ్మమ్మ, వాళ్ల అమ్మమ్మ కూడా తిన్న ఆహారం ఇది. బియ్యంతో బిర్యానీ, పులిహోర, కిచిడీ... ఇలా ఒకటేంటి అనేక రకాలు వండుతాం. ఇలా పలురకాలుగా ఉపయోగించే ఆహారాన్ని సూపర్‌ఫుడ్‌ అంటారు. అన్నం అద్భుతమైన సూపర్‌ఫుడ్‌. మనదేశంలో పదివేలకుపైగా వరి జాతులున్నాయి. ఎర్రబియ్యం, నల్లబియ్యం.. ముతక బియ్యం, సన్నబియ్యం అంటూ ఇలా ఎన్నో రకాలు. స్థానిక వంగడాలకి విలువ ఇవ్వండి. పొట్టుతీయని బియ్యాన్ని వాడండి. అద్భుతమైన పోషకాలు అందుతాయి. ఇక నెయ్యి, గోధుమలు కూడా మన తాతల తరం నుంచి వాడుతున్నవే. ఇవి కూడా మితంగా వాడితే ఆరోగ్యానికి ఏమాత్రం హానిచేయవు.

సూపర్‌ఫుడ్స్‌ అనగానే మనకి బెర్రీస్‌, అవకాడో, చియా గింజలు, ఆలివ్‌నూనె, క్వినోవా వంటివి గుర్తుకొస్తాయి. విదేశాలనుంచి దిగుమతి అయినవి మాత్రమే సూపర్‌ఫుడ్స్‌ అనుకుంటే పొరపాటు. స్థానికంగా దొరుకుతూ, తరాలు తరబడి అలవాటైన ఏ ఆహారమైనా ఏవైనా సూపర్‌ఫుడ్సే అవుతాయి. స్థానికంగా దొరికే మునగ, అన్నం, నెయ్యి, నేరేడు వంటివన్నీ సూపర్‌ఫుడ్స్‌ కోవలోకే వస్తాయి.
చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. అది కూడా తమ ఇరవైల్లో ఎలా ఉన్నామో అలా? ఆ కోరిక బాగానే ఉంది. మరి ఇరవై ఏళ్ల క్రితం మీరు తిన్న ఆహారమే ఇప్పుడు తింటున్నారా? ఇంతగా కార్బోహైడ్రేట్లు, శుద్ధిచేసిన ఆహారం అప్పుడు ఉండేవా? స్థానికంగా దొరికే వాటిని సంప్రదాయ పద్ధతుల్లో వండుకొని తినేవారు కదా! ఇప్పుడు కూడా ఆ పద్ధతినే పాటించండి. కచ్చితంగా బరువు తగ్గుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు