రేల పూలతో కూర..

వేసవిలో రేల పూలు విరివిగా దొరుకుతాయి. వీటిల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

Published : 09 Apr 2023 00:08 IST

వేసవిలో రేల పూలు విరివిగా దొరుకుతాయి. వీటిల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచుతాయి. శరీరాన్ని చల్లబరచటంలోనూ ప్రధానపాత్ర పోషిస్తాయి.

కావల్సిన పదార్థాలు: రేల పూలు- ఒక కప్పు, పెసరపప్పు- అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక చెంచా, ఉప్పు, కారం- తగినంత, నూనె- కూరకి సరిపడా. పోపు దినుసులు- ఒక చెంచా, పచ్చిమిర్చి- మూడు, ఉల్లిపాయలు- ఒక కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండుకొబ్బరి పొడి- ఒక చెంచా, ధనియాల పొడి- అరచెంచా.

తయారీ.. : ముందుగా రేల పూలను వలుచుకొని రేకలు మాత్రమే కూర కోసం తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి, అవి మునిగేవరకూ నీళ్లు పోయాలి. అందులో చిటికెడు ఉప్పు వేసి, అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. తాలింపునకు బాండీ పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడా నూనె వేసుకోవాలి. పోపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, కాస్త వేగనిచ్చి రేల పూల రేకలు, పెసరపప్పు, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. అయిదు నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు పోసి మరింత మగ్గనివ్వాలి. చివరగా ఎండుకొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అంతే పక్కా లోకల్‌ రేల పూల కూర తయార్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని