పనసపిక్కల ఫ్రై... వెలక్కాయ జ్యూస్‌

పక్కూరు వెళ్తేనే ఇక్కడి స్పెషల్‌ ఏంటి అని అడుగుతాం. మరి పొరుగు దేశం వెళ్తే మనం తినదగ్గవి ఏంటి అని ఆలోచిస్తాం కదా!

Published : 28 May 2023 00:06 IST

పక్కూరు వెళ్తేనే ఇక్కడి స్పెషల్‌ ఏంటి అని అడుగుతాం. మరి పొరుగు దేశం వెళ్తే మనం తినదగ్గవి ఏంటి అని ఆలోచిస్తాం కదా! ప్రకృతి అందాలు కొలువుండే శ్రీలంకలో ప్రత్యేకం ఏంటో తెలుసా? ఎగ్‌హాపర్స్‌... కొట్టు..

ఇక్కడ మన దక్షిణ భారతీయ ఆహారపు అలవాట్లే ఉన్నా లంకేయులు కాస్త స్పైసీగా తినడానికి ఇష్టపడతారు. అందులోనూ చేపలు, కొబ్బరి పుష్కలంగా ఉండే ప్రాంతమేమో.. ఈ రుచులతో బోలెడు ప్రయోగాలు చేస్తారు వీళ్లు. అన్నింటికంటే ఎక్కువగా ఇక్కడ తయారుచేసే హాపర్స్‌ లేదా ఆపాలు పర్యటకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. చూడ్డానికి గిన్నెలా ఉండే ఈ ఆపాలని గుడ్డు, ఇతర పిండ్లతో తయారుచేస్తారు. పొద్దుపొద్దునే కొబ్బరి చట్నీ, మటన్‌ కూరతో అల్పాహారంగా తింటారు. ఇక్కడ దొరికే మరో రుచికరమైన వంటకం కొట్టు. దీన్నే కోతు పరోటా అని కూడా అంటారు. పేరుకు పరోటానే కానీ చూడ్డానికి అలా ఉండదు. కారణం పరోటాని లావుపాటి నూడుల్స్‌ మాదిరిగా తరిగి గుడ్డు, చీజ్‌, కాయగూరలు, చికెన్‌ ఇలా వేర్వేరు కాంబినేషన్లతో వాటిని వేయిస్తారు. శ్రీలంకలో ఎక్కడకు వెళ్లినా కొట్టు మీకు సాదర స్వాగతం పలుకుతుంది. ఇవి కాకుండా పనసపొట్టు కూర, వేయించిన పనస గింజలు ఇక్కడ ప్రత్యేకం. మనం పల్లీలు తిన్నట్టుగా ఇక్కడ పనస గింజల్ని తింటారు. ఇవే కాదు కర్రపెండ్లం చిప్స్‌, వెలక్కాయ జ్యూస్‌ అంటే ఇక్కడి వాళ్లు ప్రాణం పెడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు