బీట్‌రూట్‌తో అప్పాలోచ్‌!

అప్పాలు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదూ! నేను ఇంకొంచెం వెరైటీగా ఉండాలని బీట్‌రూట్‌తో ప్రయత్నించాను. చాలా రుచిగా ఉన్నాయంటూ మా వాళ్లంతా మెచ్చుకున్నారు.

Updated : 17 Sep 2023 03:04 IST

ప్పాలు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదూ! నేను ఇంకొంచెం వెరైటీగా ఉండాలని బీట్‌రూట్‌తో ప్రయత్నించాను. చాలా రుచిగా ఉన్నాయంటూ మా వాళ్లంతా మెచ్చుకున్నారు. ఎలా చేయాలంటే.. రెండు కప్పుల బియ్యప్పిండిలో ఒక కప్పు బీట్‌రూట్‌ తురుము, అల్లం పచ్చిమిర్చి ముద్ద, నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో పిండిని కొంచెం గట్టిగా కలపాలి. కడాయిలో వేయించడానికి అవసరమైనంత నూనె వేసి కాగనివ్వాలి. కలిపిన పిండిని నిమ్మకాయ పరిమాణంలో ఉండలు తీసుకుని పూరీ మేకర్‌లో ఒత్తుకుని నూనెలో వేసి వేయించాలి. అప్పాలను పాలిథిన్‌ కవర్‌ మీద కూడా ఒత్తుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్‌గా ఇవెంతో రుచిగా ఉంటాయి. బీట్‌రూట్‌ తింటే రక్తం పెరుగుతుందని తెలుసు కదా! కానీ.. కూరగా చేస్తే తినని పిల్లలు ఈ రూపంలో ఇష్టంగా తింటారు. నూనె ఎక్కువ పీల్చుకోవు, ముదురు గులాబీ రంగులో ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి.

దాసరి శశికళ, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు