కరకరలాడే ఖాప్సే.. తింటే వదలరు!

దేశమంతా సాధారణంగా ఉండే వంటలతో పాటు.. ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. అలా టిబెట్‌లో ఖాప్సే విశిష్టం. దీన్నెలా చేయాలంటే..

Published : 26 May 2024 00:35 IST

దేశమంతా సాధారణంగా ఉండే వంటలతో పాటు.. ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. అలా టిబెట్‌లో ఖాప్సే విశిష్టం. దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లలో 4 టేబుల్‌ స్పూన్ల పంచదార, రెండు చెంచాల నూనె వేసి, మరిగించాలి. ఏడు కప్పుల గోధుమపిండిలో.. నూనె కలిసిన  పంచదార సిరప్‌ కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. బాగా మర్దించాలి. మెత్తగా అయ్యాక.. ఓ గంట పక్కనుంచాలి. తర్వాత.. రొట్టెలుగా ఒత్తుకుని.. చిన్న ముక్కలుగా కట్‌చేయాలి. వాటిని- సాగదీసి, మెలిపెట్టి, నిలువుగా, వంకరగా, గుండ్రంగా మలచి.. రకరకాల ఆకృతులు చేయాలి. కొందరైతే జడలు అల్లినట్లు కూడా చేస్తారు. కళాహృదయం ఉండాలే గానీ.. వీటిని ఎన్నెన్నో రకాలుగా ఆకర్షణీయంగా చేయొచ్చు అంటారు. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయిస్తే సరిపోతుంది. ఈ కరకరలాడే ఖాప్సే.. తింటే వదలరు! ఇవి కొంచెం స్వీట్‌ కాజాల్లా అనిపిస్తాయి కానీ.. నీళ్లలో పంచదార, నూనె కలిపి మరిగించడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది.     


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు