సోయాబీన్‌ మటర్‌ సబ్జీ చేద్దామా!

మనం దోస, బెండ, తోటకూర, పాలకూర.. ఇలా కాయగూరలు ఎక్కువగా తింటాం కదా! దిల్లీలో సోయా తరచుగా తింటారు. వాటిలో ‘సోయాబీన్‌ చూరా మటర్‌ సబ్జీ’ నోటికి హితవుగానూ ఉంటుంది, మంచి పోషకాలూ అందుతాయి.

Updated : 02 Jun 2024 01:16 IST

పొరుగు రుచి

నం దోస, బెండ, తోటకూర, పాలకూర.. ఇలా కాయగూరలు ఎక్కువగా తింటాం కదా! దిల్లీలో సోయా తరచుగా తింటారు. వాటిలో ‘సోయాబీన్‌ చూరా మటర్‌ సబ్జీ’ నోటికి హితవుగానూ ఉంటుంది, మంచి పోషకాలూ అందుతాయి. దీన్నెలా చేయాలంటే.. రెండు కప్పుల సోయా గ్రాన్యూల్స్‌కి- టేబుల్‌స్పూన్‌ నెయ్యి, రెండు ఉల్లిపాయలు, 4 టొమాటోలు, కప్పు పచ్చి బఠాణీలు, అరకప్పు పెరుగు, 4 లవంగాలు, 3 యాలకులు, టేబుల్‌స్పూన్‌ వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, జీలకర్ర పొడి, కారం, అల్లం ముద్ద, గరంమసాలా, ధనియాల పొడి చెంచా చొప్పున, తగినంత ఉప్పు, అంగుళం దాల్చినచెక్క, కొత్తిమీర, పసుపు అవసరమౌతాయి. 

సోయా గ్రాన్యూల్స్‌ను పావుగంటపాటు వేడినీళ్లలో ఉంచి ఆ నీళ్లు వడకట్టేసి పక్కన ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను ముక్కలుగా కోసుకోవాలి. టొమాటోలను గ్రైండ్‌ చేయాలి. పాన్‌లో నెయ్యి వేడయ్యాక.. జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి. అవి వేగాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముద్దలను లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి. అందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చి బఠాణీలు, టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత.. ఉప్పు, సోయా గ్రాన్యూల్స్, గిలకొట్టిన పెరుగు, కప్పున్నర నీళ్లు జతచేసి, ఇంకో నాలుగు నిమిషాలుంచాలి. దించేసి.. కొత్తిమీర తరుగు చల్లితే సరిపోతుంది. ఇది రోటీలు, అన్నం ఎందులోకైనా బాగుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని