మాంసానికి ప్రత్యామ్నాయం క్వినోవా

దక్షిణ అమెరికాలో ఎక్కువగా తినే ధాన్యం క్వినోవా. పూర్తి పేరు చినోపోడియం క్వినోవా.

Published : 16 Jun 2024 00:28 IST

క్షిణ అమెరికాలో ఎక్కువగా తినే ధాన్యం క్వినోవా. పూర్తి పేరు చినోపోడియం క్వినోవా.

ఏమేం సుగుణాలు ఉంటాయి? 

బి1, బి6, ఇ-విటమిన్లు, అమినో యాసిడ్స్, ఒమేగా-6, పీచు, మాంగనీస్, మెగ్నీషియం, ఫొలేట్, భాస్వరం, కాపర్, జింక్, పొటాషియం, ఐరన్‌. మాంసాహారానికి చక్కటి ప్రత్యామ్నాయం. 

ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున అనారోగ్యాలను నివారిస్తుంది. జీర్ణప్రక్రియ బాగుంటుంది. కాస్త తింటేనే ఆకలి తీరిన భావన కలుగుతుంది కనుక.. ఇంకా ఇంకా తినాలన్న తపన ఉండదు. అందువల్ల ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మంచిది. 

వండటం ఎలా?

క్వినోవా తేలిగ్గా ఉడుకుతుంది. కాస్త ఉప్పు జతచేసి జావ చేసుకోవచ్చు. ఉడికించి.. కూర లేదా చారుతో తినొచ్చు. పచ్చి మిర్చి, ఉల్లి, నిమ్మరసం చేర్చి ఉప్మా, కూరగాయలు జోడించి కిచిడీ కూడా చేయొచ్చు. ఇది తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, లేత గులాబీ రంగుల్లో దొరుకుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కనుక క్వినోవా తరచూ తిందామా మరి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని