పేఠా తింటారా!

ఆగ్రా, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్‌ ప్రాంతాలకు వెళ్లినవాళ్లు తప్పకుండా తీసుకొచ్చే మిఠాయి పేఠా. దీన్ని ఎలా చేస్తారంటే.. 2 కిలోల బూడిదగుమ్మడికి 4 కప్పుల పంచదార అవసరమవుతుంది.

Published : 16 Jun 2024 01:00 IST

గ్రా, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్‌ ప్రాంతాలకు వెళ్లినవాళ్లు తప్పకుండా తీసుకొచ్చే మిఠాయి పేఠా. దీన్ని ఎలా చేస్తారంటే.. 2 కిలోల బూడిదగుమ్మడికి 4 కప్పుల పంచదార అవసరమవుతుంది. బూడిదగుమ్మడి మందమైన చెక్కును, లోపలి విత్తనాలను తీసేసి, తెల్లటి భాగాన్ని ముక్కలుగా కోసి.. ఫోర్క్‌తో అన్ని వైపులా గుచ్చాలి. ఐదు కప్పుల నీళ్లలో చెంచా లైమ్‌స్టోన్, గుమ్మడి ముక్కలు వేసి.. ఓ రోజంతా నానబెట్టాలి. ఈ ముక్కలను ఆరుసార్లు కడగాలి. మందపాటి గిన్నెలో ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి మరిగించాలి. దానికి గుమ్మడి ముక్కలు జోడించి, ఓ ఇరవై నిమిషాల తర్వాత నీళ్లు వార్చేయాలి. మరో పాత్రలో 2 కప్పుల నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. పాకం తయారయ్యాక.. గుమ్మడి ముక్కలు వేసి.. ఉడికించాలి. పావుగంట తర్వాత దించేసి, ఆరేడు గంటలు అలా ఉంచేయాలి. దీన్ని మరోసారి ఉడికిస్తూ.. మధ్యమధ్యలో కలియబెట్టాలి. మూడు నిమిషాల తర్వాత సెగ తీసేసి చల్లారనివ్వాలి. పంచదార పీల్చుకున్న గుమ్మడి ముక్కలను గిన్నెలోంచి తీసి.. పళ్లెంలో పరిచి.. ఒకరోజంతా కదిలించకుండా ఉంచాలి. అప్పుడిక పాకం ఎండినట్లయి, చేతికి అంటదు. ఈ మిఠాయిని కొందరు వెగటు తీపి అంటారు కానీ, ఎక్కువమంది ఇష్టంగా తింటారు. ఇది ఆగ్రాలో చాలా ప్రసిద్ధం. తాజ్‌మహల్‌ చూసేందుకు వెళ్లిన పర్యటకులు ఈ పేఠాని ఆగ్రా గుర్తుగా తప్పకుండా తీసుకెళ్తారు. అందువల్ల ఈ మిఠాయి తయారీ ఆ ప్రాంతంలో ఎందరికో బతుకుతెరువు అయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని