ముంతాజ్‌ హరియాలీ చికెన్‌ బిర్యానీ

కావాల్సినవి: బాస్మతి బియ్యం- అర కిలో, చికెన్‌- కిలో, పెరుగు- పావుకిలో, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉల్లిపాయ తరుగు, టొమాటో ప్యూరీ, పుదీనా, కొత్తిమీర తరుగు, నెయ్యి- కప్పు చొప్పున, పచ్చిమిర్చీ- పది, ఉప్పు- తగినంత, షాజీరా- చెంచా, ఇలాచీ, లవంగాలు- నాలుగైదు చొప్పున, దాల్చిన చెక్క-

Updated : 06 Mar 2022 05:16 IST


కావాల్సినవి: బాస్మతి బియ్యం- అర కిలో, చికెన్‌- కిలో, పెరుగు- పావుకిలో, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉల్లిపాయ తరుగు, టొమాటో ప్యూరీ, పుదీనా, కొత్తిమీర తరుగు, నెయ్యి- కప్పు చొప్పున, పచ్చిమిర్చీ- పది, ఉప్పు- తగినంత, షాజీరా- చెంచా, ఇలాచీ, లవంగాలు- నాలుగైదు చొప్పున, దాల్చిన చెక్క- పెద్ద ముక్క, స్టార్‌ పువ్వులు- రెండు, గరంమసాలా పొడి- రెండు చెంచాలు, ధనియాల పొడి- చెంచా, పసుపు- చిటికెడు, నిమ్మరసం- చెంచా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి ఉల్లిపాయలను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని చేత్తో చిదిమి ఓ పక్కన పెట్టుకోవాలి. చికెన్‌ను శుభ్రం చేసి, ఉప్పు, పసుపు వేసి గంట నానబెట్టాలి. మరోసారి పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి పచ్చిమిర్చీ వేసి వేయించాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కొత్తిమీర, పుదీనా వేసి పచ్చివాసన పోయేవరకు మగ్గించాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు, ధనియాల పొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో చికెన్‌ వేసి చిన్న మంటపై దాదాపు 30 నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమానికి వేయించిన ఉల్లిపాయలను జత చేయాలి. నీళ్లు అస్సలు పోయొద్దు. కూరలో ఉన్న నీటితోనే ఉడకనివ్వాలి. మరోసారి పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక హోల్‌ గరంమసాలా దినుసులు, బియ్యం వేసి, నీళ్లు పోసి 90 శాతం ఉడికించాలి. మందపాటి గిన్నె తీసుకుని అన్నం, చికెన్‌ మిశ్రమాన్ని పొరలు, పొరలుగా వేసుకోవాలి. చిన్న మంటపై ఉడికించాలి. ఆ తర్వాత బిర్యానీని దించేసి అరగంట వరకు కదపొద్దు. అంతే రుచికరమైన ముంతాజ్‌ హరియాలీ బిర్యానీ సిద్ధమైపోయింది. కావాలనుకుంటే కుంకుమపువ్వు కలిపిన పాలు లేదా ఆరెంజ్‌/పసుపు ఆహార రంగును వేసుకుంటే బిర్యానీ చక్కటి రంగులో కనిపిస్తుంది.                        
 

- పి. సాయి దీపిక, సూరారం, రంగారెడ్డి జిల్లా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని