చంపారన్‌ కుండ కూర...!

కుండ బిర్యానీ గురించి విని ఉంటారు. మరి కుండ మటన్‌ గురించి విన్నారా? ఉత్తరాదిన మనకు చాలా చోట్ల స్టాళ్లలో పెట్టి కుండల్లో అమ్మే మటన్‌ కనిపిస్తుంది. దీన్నే చంపారన్‌ మటన్‌ అనీ, అహునా,

Published : 24 Jul 2022 01:25 IST

కుండ బిర్యానీ గురించి విని ఉంటారు. మరి కుండ మటన్‌ గురించి విన్నారా? ఉత్తరాదిన మనకు చాలా చోట్ల స్టాళ్లలో పెట్టి కుండల్లో అమ్మే మటన్‌ కనిపిస్తుంది. దీన్నే చంపారన్‌ మటన్‌ అనీ, అహునా, హండీమీట్‌ అనీ పిలుస్తుంటారు. ఎక్కువగా చంపారన్‌ మీట్‌గా ప్రాచుర్యంలో ఉన్న ఈ కుండ కూరకి మూలం బిహార్‌లోని చంపారన్‌ ప్రాంతం..

హునా మటన్‌ కర్రీ.. లేదా చంపారన్‌ మటన్‌కర్రీ తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక కుండలో మటన్‌, ఆవనూనె, నెయ్యి, వెల్లుల్లిని రెబ్బలుగా కాకుండా మొత్తం పాయలుగా వేస్తారు. తక్కిన పదార్థాలు కూడా వేసి కుండపై మట్టి మూతపెట్టి అందులోని ఆవిరి బయటకు పోకుండా ఉండేందుకు గోధుమపిండితో మూసేస్తారు. ఈ కుండని మంటపై కాకుండా బొగ్గులపై నిదానంగా ఉడికిస్తారు. ఎక్కడా నీళ్లు వాడరు. అందులోని ఆవిరితోనే అది ఉడకాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో చేసిన చంపారన్‌ మీట్‌ ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితం అయినా ఇప్పుడు మన దక్షిణాదిలోనూ సందడి చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని