ఖైదీ పోస్టర్ చూస్తూ..పీతల వేపుడు తినొచ్చు!
నాటుకోడి కూర.. చీరమీను ఇగురు పండుగొప్పఫ్రై.. కొరమీను పులుసు, చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ ఇలాంటి సంప్రదాయ రుచులన్నీ ఒకచోట చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా?
నాటుకోడి కూర.. చీరమీను ఇగురు పండుగొప్పఫ్రై.. కొరమీను పులుసు, చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ ఇలాంటి సంప్రదాయ రుచులన్నీ ఒకచోట చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌లోని 1980 మిలటరీ హోటల్ గురించి తెలుసుకోవాల్సిందే..
రకరకాల మాంసాహార వంటకాలని రుచి చూడాలని సంబరపడిపోయే నాన్‌వెజ్ ప్రియులకోసమే ఈ హోటల్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పేరు 1980 మిలటరీ హోటల్. హైదరాబాద్‌లో ఉంది. లోపలకి అడుగుపెడితే...కలపతో చేసినవి అనిపించేలాంటి సరంబీలు, కొండపల్లి బొమ్మలు, గోడలపై ఎనభైలనాటి ఖైదీ, సర్దార్ పాపారాయుడు, ప్రేమఖైదీ సినిమా పోస్టర్లు, ఇంకాస్త ముందుకు వెళ్లిచూస్తే అద్దాల ఫ్రేములో వేలాడదీసిన ఆర్మీ యూనిఫాంలు చూస్తాం. ఇక్కడ నుంచి 1980ల్లోకి పరుగులు పెడతాం. ఒకప్పుడు దక్షిణ కర్ణాటక, తమిళనాడు జాతీయ రహదారుల్లో మిలటరీ హోటళ్లు ఉండేవి. అందులో సైన్యంలో పనిచేసేవారు శారీరక దార్ఢ్యం కోసం తినే వంటకాలను రుచి చూపించేవారు. ఆ చిన్ననాటి జ్ఞాపకాన్నే స్ఫూర్తిగా తీసుకుని డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకి చెందిన శ్రీకర్ వైట్ల.. ఫణివర్మ, సాహూ అనే స్నేహితులిద్దరితో కలిసి దేశీస్టైల్ నాన్‌వెజ్ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. ఇక్కడి వంటకాలు... ఆనాటి రుచులకు తీసిపోకుండా ఉండాలని పాశ్చాత్య శైలిని అనుకరించకుండా అచ్చ తెలుగింటి వంటగదుల్లోని సువాసననూ, రుచినీ వినియోగదారులకు అందించాలనుకున్నారు. అందుకే అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, అత్తమ్మలు చేసిన ఎన్నో పాతకాలపు వంటకాలనే కొత్తగా హోటల్ మెనూలోకి తెచ్చిపెట్టారు. అందుకే సెలబ్రిటీలు సైతం ఇక్కడికి క్యూ కడుతుంటారు. తెలుగు తారలే కాదు..ధనుష్, శంకర్ వంటి వారికీ ఈ వంటకాలు నచ్చి తరచూ వస్తుంటారని నిర్వహకులు చెబుతున్నారు.
- స్వాతి, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!