కీమాబాల్స్ విరగకుండా రావాలంటే...
మా పిల్లలకి కీమా బాల్స్ చేసి పెట్టాలని ఉంది. సరిగా రావడం లేదు. ఎంత జాగ్రత్తగా చేసినా విరిగిపోతున్నాయి. వీటిని తేలిగ్గా, రుచిగా చేసుకొనేందుకు చిట్కాలుంటే చెబుతారా?
మా పిల్లలకి కీమా బాల్స్ చేసి పెట్టాలని ఉంది. సరిగా రావడం లేదు. ఎంత జాగ్రత్తగా చేసినా విరిగిపోతున్నాయి. వీటిని తేలిగ్గా, రుచిగా చేసుకొనేందుకు చిట్కాలుంటే చెబుతారా?
* మటన్‌కీమాని కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కీమాతోపాటు తెల్లని ఫ్యాట్ ఉంటుంది దీనిని చికన అంటారు. దాన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి. అలాగే రిబ్స్ దగ్గర ఉండే లేత మాంసం సీనకూర అంటారు. దానిని కూడా వేసి కీమా కొట్టమనాలి. ఆ తర్వాత మాంసాన్ని శుభ్రం చేసుకుని, నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఈ కీమాలో అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరంమసాలా, సెనగపిండి వేసి కలుపుతారు. ఇక్కడ సెనగపిండికి బదులుగా పుట్నాల పొడి వేసుకుంటే రుచి బాగుంటుంది. కరకరలాడుతూ వస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయలు వేస్తే దానిలోని నీరు బయటకు వచ్చి ఉండలు విరిగిపోతాయి. బదులుగా వేయించిన ఉల్లిపాయలు కలిపితే మంచి రుచి వస్తుంది. పిండి కలిపేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయొద్దు. కొంచెం గట్టిగా కలపాలి. అలాగే.. నూనె వేడెక్కాక ఉండలు వేసి వెంటనే కలపకూడదు. పావు నిమిషం ఆగి అప్పుడు కదపాలి. లేకపోతే విరిగిపోతాయి. ఎంత చేసిన విరుగుతున్నాయి అనుకొంటే ఒక గుడ్డు పగలకొట్టి కీమా మిశ్రమంలో వేయండి. రుచిగా, విరగకుండా వస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు