కబాబ్‌లు చేయడం తేలికిక!

నూనె తక్కువ... పోషకాలు ఎక్కువ. రుచిలో బ్రహ్మండంగా ఉండే కబాబ్‌లు, టిక్కాలని ఇష్టపడని వాళ్లుండరు.

Updated : 18 Dec 2022 00:28 IST

సౌకర్యం

నూనె తక్కువ... పోషకాలు ఎక్కువ. రుచిలో బ్రహ్మండంగా ఉండే కబాబ్‌లు, టిక్కాలని ఇష్టపడని వాళ్లుండరు. కానీ వాటిని చేయడానికే.. చాలా ఓపిక, సమయం ఉండాలి. దగ్గరుండి గ్రిల్‌పైన దోరపదును మీద కాల్చకపోతే మాడిపోతాయి. ఆ కష్టం లేకపోతే కబాబ్‌లని భలేగా ఆస్వాదించొచ్చు. కానీ ఈ ఎలక్ట్రికల్‌ వెర్టికల్‌ కబాబ్‌ మెషిన్‌ మీ చేతిలో ఉంటే ఎన్నికావాలంటే అన్ని కబాబ్‌లని పెద్దగా శ్రమ లేకుండానే తయారు చేసుకుని తినేయొచ్చు. ఈ పరికరం అడుగున నూనె వేసేందుకు జాగా ఉంటుంది. దాంట్లో కొద్దిగా నూనె వేసి... పనీర్‌, చికెన్‌, మటన్‌, కాయగూర ముక్కలని కబాబ్‌ ఊచలకి గుచ్చి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. ఆ ఊచలు గుండ్రంగా తిరుగుతూ, వాటికున్న కూరగాయముక్కలని ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద కాలుస్తాయి. నూనె కూడా తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటుంది. కబాబ్‌లు పూర్తికాగానే ఆటోమేటిక్‌గా పరికరం స్విచ్‌ఆఫ్‌ అవుతుంది. బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని