పీతల.. దోసె!

ఉల్లి దోసె, మసాలా దోసె, చీజ్‌ దోసె, తవా దోసె ఇవన్నీ ఓల్డు... క్రాబ్‌దోసె బెస్టు అంటారు ఈ టిఫిన్‌ సెంటర్‌లో పీతలదోసెని తింటే?వినియోగదారుల్ని ఆకట్టుకొనేందుకు ఈమధ్యకాలంలో రకరకాల దోసెలు వస్తున్నాయి

Updated : 01 Jan 2023 06:38 IST

ఉల్లి దోసె, మసాలా దోసె, చీజ్‌ దోసె, తవా దోసె ఇవన్నీ ఓల్డు... క్రాబ్‌దోసె బెస్టు అంటారు ఈ టిఫిన్‌ సెంటర్‌లో పీతలదోసెని తింటే? 

వినియోగదారుల్ని ఆకట్టుకొనేందుకు ఈమధ్యకాలంలో రకరకాల దోసెలు వస్తున్నాయి. ఐస్‌క్రీం దోసె, చాక్లెట్‌ దోసె వంటివి ఆ క్రమంలో వచ్చినవే. కానీ.. ఈ పీతల దోసె గురించి మీరు విని ఉండరు. రుచి చూస్తే మాత్రం వదలరు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఐడిఎల్‌ చెరువు పక్కన ఉన్న ‘గీత టిఫిన్‌ సెంటర్‌’కి వెళ్తే ఈ క్రాబ్‌ దోసెని రుచి చూడొచ్చు. ఇక్కడ దొరికే అల్పాహారాల్లో ఇది ప్రత్యేకం. అందుకే సాయంత్రం అయితే చాలు ఈ దోసెని రుచి చూడ్డానికి జనాలు క్యూ కడుతుంటారు. పదేళ్ల క్రితం ఉపాధి కోసం విజయవాడ నుంచి వచ్చిన గీత మొదట్లో ఇడ్లీ, పొంగణాలు తయారుచేస్తూ టిఫెన్‌ సెంటర్‌ని ప్రారంభించారు. ఆదరణ పెరగడంతో నాన్‌వెజ్‌ రుచులని కూడా జోడించారు. రంగనాయకుల చెరువు పక్కన ఎన్నో టిఫెన్‌ సెంటర్లున్నా గీత చేసే టిఫిన్లు బాగుంటాయని అంటారు అక్కడకు వచ్చే భోజనప్రియులు. ఈ క్రాబ్‌దోసెని రుచి చూడ్డానికి డాక్టర్లు, పైలెట్లు, నటులు కూడా వస్తుంటారట. దీని ధర రూ.130. ఆదివారాల్లో అయితే ఈ దోసె దొరకడం కష్టమే. అంత డిమాండ్‌ మరి.  


ఘంటశాల వసంత కుమార్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని