ప్రేమతో.. పుదీనా!
పొద్దుపొద్దునే ప్రేమగా మీవారికి ఓ పుదీనా చాయ్ ఇచ్చి చూడండి ఆయన కుష్ అవ్వాల్సిందే! చికెన్‌లో కాసిని పుదీనా ఆకులు వేసి వండండి. మీ మధ్య ఘాటు ప్రేమ పుట్టాల్సిందే. కాసింత ప్రేమ... కాసింత ఘాటుతో ఈ పుదీనా వంటలు వండేయండి..
పొద్దుపొద్దునే ప్రేమగా మీవారికి ఓ పుదీనా చాయ్ ఇచ్చి చూడండి ఆయన కుష్ అవ్వాల్సిందే! చికెన్‌లో కాసిని పుదీనా ఆకులు వేసి వండండి. మీ మధ్య ఘాటు ప్రేమ పుట్టాల్సిందే. కాసింత ప్రేమ... కాసింత ఘాటుతో ఈ పుదీనా వంటలు వండేయండి..
* ఆస్తమాతో సహా ఇతర శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవారికి పుదీనా ఉపశమనాన్ని ఇస్తుంది.
* సలాడ్లు, సూపులు వీటిల్లోకి తాజా పుదీనా ఆకుల్ని వేసుకుంటే జలుబు, దగ్గుల నుంచి రక్షించే ఔషధంలా పనిచేస్తుంది.
* తలనొప్పి, వికారం వంటివి బాధిస్తున్నప్పుడు గుప్పెడు ఆకులు వాసన చూసినా చాలు. ఉపశమనం కలుగుతుంది.
మింట్ రైస్
కావాల్సినవి: అన్నం- అరకప్పు, పుదీనా- పావు కప్పు, ధనియాలు- రెండు చెంచాలు, సెనగపప్పు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- 1, కొబ్బరికోరు- చెంచా, నూనె- మూడు చెంచాలు, జీడిపప్పులు- నాలుగు, పల్లీలు- రెండు చెంచాలు, ఆవాలు- పావుచెంచా, మినపప్పు- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ
తయారీ: స్టౌపై కడాయిపెట్టి వేడెక్కాక నూనె పోసి, ఆవాలు వేయించుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, పల్లీలు, జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడదే పాన్‌లో ధనియాలు, మిర్చి, సెనగపప్పు, నచ్చితే కొబ్బరి కూడా వేసి వేయించి స్టౌ కట్టేయాలి. తర్వాత పుదీనా ఆకులు వేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అన్నం చల్లగా అయ్యాక ఈ మిశ్రమాన్ని ఆ అన్నంలో వేసి బాగా కలిపి ముందుగా ఆవాలు, జీడిపప్పుతో వేసుకున్న తాలింపు గింజల్ని ఇందులో కలపాలి. ఘాటుగా ఉండే ఈ అన్నం జలుబు చేసినప్పుడు తింటే భలే రుచిగా ఉంటుంది.
మింట్ చాయ్
కావాల్సినవి: తాజా పుదీనా ఆకులు- గుప్పెడు, టీ బ్యాగులు- రెండు, నీళ్లు- రెండున్నర కప్పులు, పాలు- తగినన్ని, పంచదార- రుచికోసం
తయారీ: పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టీ గిన్నెలో నీళ్లు మరిగించుకుని అందులో పుదీనా ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు మరిగించుకోవాలి. నీళ్లు పచ్చగా మారాక తగినంత పంచదార వేసుకోవాలి. ఇప్పుడు టీ బ్యాగులు లేదా టీ పొడి వేసి మరిగాక.. నచ్చితే పాలు కలపొచ్చు. లేదంటే అలానే తాగేయొచ్చు. ఘాటైన ఈ టీని బిస్కట్లతో కలిపి తాగితే హాయిగా అనిపిస్తుంది. పంచదార బదులు బెల్లం వాడినా మంచిదే.
టిక్కా
కావాల్సినవి: పనీర్- 250గ్రా, ఉల్లిపాయ- 1, టొమాటో- 1, క్యాప్సికమ్- అరముక్క, సెనగపిండి- 2 చెంచాలు, పసుపు- కొద్దిగా, మిరియాలపొడి- చెంచా, కరిగించిన వెన్న- చెంచా గ్రీన్ చట్నీ కోసం: వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పచ్చిమిర్చి- నాలుగు, పెరుగు- 2 చెంచాలు, చాట్‌మసాలా- అరచెంచా, నల్లుప్పు- కొద్దిగా, నిమ్మరసం- రెండు చెంచాలు, పుదీనా- కప్పు, కొత్తిమీర- కప్పు
తయారీ: పనీర్‌ని కావాల్సిన సైజులో ముక్కలుగా తరిగి వేడినీటిలో నానబెట్టి ఉంచాలి. ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్ వీటిని ముక్కలుగా టిక్కాకి తగ్గట్టు పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీలో.. వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోనే పెరుగు, నల్లుప్పు, చాట్‌మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి మళ్లీ రుబ్బుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి, పసుపు, మిరియాలపొడి, కరిగించిన బటర్, రుబ్బిన గ్రీన్‌చట్నీ కూడా వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు తీసేసిన పనీర్ ముక్కలని, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్‌ముక్కలు వేసి మసాలా బాగా పట్టించి టిక్కా ఊచలకి ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి. ముందుగానే వేడి చేసి ఉంచిన అవెన్‌లోకానీ... గ్రిల్‌మీద కానీ ఉంచి అన్నివైపులకి తిప్పుతూ కాల్చితే రుచికరమైన పుదీనా పనీర్ టిక్కా రెడీ.
పుదీనా మకానా
కావాల్సినవి: వేయించిన మకానా- కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, పుదీనా పొడి- రెండు చెంచాలు, చాట్‌మసాలా- అరచెంచా, ఉప్పు- కొద్దిగా
తయారీ: కడాయిలో మకానాని నాలుగైదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి. చేత్తో నలిపితే సాగకుండా, గుల్లగా ఉండి విరగాలి. అదే కడాయిలో నెయ్యి, చాట్‌మసాలా, ఉప్పు వేసి మరొక్క నిమిషం వేయించి స్టౌ కట్టేయాలి. చాట్‌మసాలా లేకపోతే గరంమసాలా, ఆమ్‌చూర్‌పొడి కూడా వాడుకోవచ్చు. ఇవి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.
చికెన్
కావాల్సినవి: చికెన్- 700గ్రా, ఉల్లిపాయ- ఒకటి, తాజాగా రుబ్బిన అల్లం, వెల్లుల్లి పేస్ట్- చెంచా, పచ్చిమిర్చి- నాలుగు, మిరియాలపొడి- చెంచాన్నర, ఉప్పు, పంచదార- రుచికి తగినంత, నూనె- నాలుగు చెంచాలు, పుదీనా ఆకులు- గుప్పెడు, నిమ్మరసం- రెండు చెంచాలు
తయారీ: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి.. వీటిలో పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్‌కి పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాలపొడి, పుదీనాపేస్ట్‌లో సగం వేసుకుని బాగా కలిపి రెండు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయముక్కల్లో తగినంత ఉప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మూతపెట్టి పావుగంటపాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చికెన్‌లోంచి వచ్చిన నీరుతో మరికాసేపు ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక.. అందులో కొద్దిగా నీళ్లు, పంచదార, మిగిలిన పుదీనా పేస్ట్ వేసి కాసేపు ఉడికించి కట్టేయాలి. లేదంటే ఆ పుదీనా పరిమళం తగ్గిపోతుంది. ఆ తర్వాత.. మిరియాలపొడి, తాజా నిమ్మరసం వేసుకుంటే మింట్ చికెన్ రెడీ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Afghanistan: భారత్‌లో మా ఎంబసీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం: ఆఫ్గానిస్థాన్
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు