కొండల్ని తింటారు... మట్టినే మసాలాగా వాడతారు!
తింటే కొండలు కూడా కరిగిపోతాయి అనే సామెత విన్నారు కదా! కానీ ఈ దీవిలో ప్రజలు నిజంగానే కొండని తింటారండి బాబు. అదెలా అంటారా? ఈ దీవిపేరు హోర్ముజ్.
తింటే కొండలు కూడా కరిగిపోతాయి అనే సామెత విన్నారు కదా! కానీ ఈ దీవిలో ప్రజలు నిజంగానే కొండని తింటారండి బాబు. అదెలా అంటారా? ఈ దీవిపేరు హోర్ముజ్. ఇరాన్‌లో ఉందీ ప్రాంతం. ప్రపంచంలోనే తినే ఏకైక కొండ ఇది. దీనినే ఇంద్రధనుస్సు దీవి అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ బీచ్‌లన్నీ వర్ణమయంగా ఉంటాయి కాబట్టి. ఈ దీవిని చూడ్డానికి వచ్చే వారికోసం స్థానికులు తాజా చేపల్ని పట్టి తెచ్చి.. వాటిని ఒక ప్రత్యేకమైన సాస్‌తో వండిపెడతారు. ఈ రుచి చూడకుండా ఎవరూ ఇక్కడ నుంచి బయటకు వెళ్లరట. అంత పాపులర్ ఈ వంటకం. అలాగే తోమ్‌షీ అనే బ్రెడ్‌ని కూడా చేస్తారు. అందులోనూ ప్రత్యేకమైన ఎర్రని జామ్‌ని వాడతారు. ఇవే కాదు మరికొన్ని ప్రత్యేకమైన వంటకాలు.. అందులో వాడే మసాలాలు, సాస్‌లు, జామ్‌లు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అందుకు కారణం ఏంటో తెలుసా? అక్కడ దొరికే మట్టినే ఇలా సాస్‌లు, మసాలాలుగా వాడతారు కాబట్టి. ఏంటీ మట్టిని మసాలాగా వాడతారా అంటారా. మీరు చదివింది నిజమే. ఇక్కడ రంగరంగుల మట్టి చాలా ప్రత్యేకం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలోని ఉప్పు, అగ్ని పర్వతాల్లోని లవణాలు కలిసిన ఏర్పడిన ఈ మట్టిని గెలాక్ అంటారు. ఇవన్నీ తినదగ్గవే. పోషకాల మయం కూడా. అందుకే ఇక్కడి స్థానికులు దీనినే ఉపాధిగా మలుచుకున్నారు. ఈ మట్టికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు